లైంగిక తీర్పుల వివాదం‌‌- బాంబే హైకోర్డు జడ్డికి సుప్రీం కొలీజియం షాక్‌

లైంగిక దాడులపై దాఖలైన పిటిషన్లపై రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన బాంబే హైకోర్టు మహిళా అదనపు న్యాయమూర్తి పుష్పా గనేడివాలాపై దేశవ్యాప్తంగా నిరనసనలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు కొలీజియం ఆమెపై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె శాశ్వత జడ్జి అయ్యేందుకు ఇప్పట్లో అవకాశం లేకుండా పోయింది.

బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న పుష్పా గనేడివాలా తాజాగా చిన్నారులపై లైంగిక వేధింపులపై దాఖలైన రెండు పిటిషన్ల విచారణ తర్వాత తీర్పులు ప్రకటించారు. అవి కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీంతో ఆయా తీర్పులు ప్రకటించిన జస్టిస్‌ పుష్పా గనేడివాలాపై న్యాయవర్గాల్లో సైతం అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఆమెను శాశ్వత జడ్జిగా నియమించేందుకు వీలుగా ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది.

sc collegium withdraws approval for appointment of additional judge of bombay hc as permanent judge

చిన్నారులపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని సరిగ్గా అన్వయించడంలో మహిళా న్యాయమూర్తి అయిన జస్టిస్‌ గనేడివాలా విఫలమయ్యారని సుప్రీంకోర్టు కొలీజియం అభిప్రాయపడింది. ఓ కేసులో చిన్నారి ఛాతీని దుస్తులపై నుంచి తాకితే పోక్సో చట్టం ప్రకారం నేరం కాదని తీర్పు ఇచ్చిన గనేడివాలా, మరో కేసులో చిన్నారి ముందు ఓ వ్యక్తి ఫ్యాంట్ జిప్‌ తీసి వికృత చేష్టలు చేయడం కూడా నేరం కాదని తీర్పులు ఇచ్చారు. ఇవి ఐపీసీ ప్రకారం మాత్రమే నేరాలని ఆమె చెప్పిన తీర్పులు వివాదస్పదంగా మారాయి. దీంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆమెను శాశ్వత జడ్జి కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+