ఈవీఎంను ప్రశ్నిస్తే జైలు నిబంధనపై ఈసీకి సుప్రీం నోటీస్

ఢిల్లీ : ఈవీఎంల పనితీరుపై ప్రశ్నిస్తే జైలు శిక్ష విధించే నిబంధనపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. ఈ నిబంధనను తొలగించాలంటూ దాఖలైన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీ వివరణ కోరింది.

ఈవీఎంలను ప్రశ్నిస్తే జైలు

ఈవీఎంలను ప్రశ్నిస్తే జైలు

ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో పోలైన ఓట్లలో తేడాలు వస్తున్నాయని న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. అయితే ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లలో ఓట్ల మధ్య వ్యత్యాసాలపై దాఖలైన ఫిర్యాదులు తప్పని రుజువైతే దాన్ని నేరంగా పరిగణించి ఆరు నెలల శిక్ష విధిస్తున్నారు.

6నెలల జైలు రూ.1000 జరిమానా

6నెలల జైలు రూ.1000 జరిమానా

ఎన్నికల కోడ్‌ నిబంధనల్లోని సెక్షన్ 49ఎంఏ ప్రకారం ఈవీఎంలలో లోపాలున్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి దాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే ఐపీసీ సెక్షన్ 177 ప్రచారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో సునీల్ అహ్యా ఈ నిబంధనను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఎన్నికల ప్రక్రియకు అవరోధం

ఎన్నికల ప్రక్రియకు అవరోధం

ఈసీ నిబంధన కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతాయని పిటీషనర్ అభిప్రాయపడ్డరు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లలో తేడా జరిగినా ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకురారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిబంధన ప్రతిబంధకంగా మారుతుందని అందుకే తొలగించాలని ధర్మాసనాన్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+