సుప్రీం ఆదేశం: ఆధార్‌తో ఓటర్ అనుసంధానికి బ్రేక్
హైదరాబాద్: ఆధార్ కార్డుతో ఓటరు అనుసంధానం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు ఈరోజు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎటువంటి అనుసంధాన ప్రక్రియ జరగరాదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇక మీదట ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు తీసుకొవద్దని, అలాగే ఫీడింగ్, సీడింగ్ కూడా చేయొద్దని ఎన్నికల కమిషన తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్ రాయితీలకు తప్ప మరే పథకానికి ఆధార్ డేటాను ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌లో పొందడానికి ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లు వ్యక్తిగతంగా తమ ఆధార్ కార్డులను ఓటర్ కార్డు కాపీలతో దరఖాస్తు చేసుకున్నారు. మరో 10 కోట్ల మంది దరఖాస్తులు వేరే పద్దతుల్లో అందాయని, ఆన్‌లైన్‌లో 3 కోట్ల మంది అనుసంధానానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవలే తెలంగాణలో పెద్ద ఎత్తున ఆధార్ అనుసంధానాన్ని చేపట్టారు. ఇప్పటికే 65 శాతానికి పైగా అనుసంధానం పూర్తికాగా, ఈసీ ఉత్తర్వులతో ఈ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచినట్లయింది. వేర్వేరు రాష్ట్రాలు లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండేవారిని గుర్తించి వాటిని ఏరివేసేందుకు ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కార్యక్రమాన్ని చేపట్టారు.












Click it and Unblock the Notifications