కేంద్రానికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు: తాత్కాలిక డైరెక్టర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ నియామకంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అలోక్ వర్మ పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు రెండు వారాల గడువు ఇచ్చింది.
అలాగే, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ నియామకం పైన కేంద్ర ప్రభుత్వానికి, సీవీసీ, సీబీఐకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

సీవీసీ దర్యాఫ్తును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరగాలని పేర్కొంది. కాగా, కొత్త డైరెక్టర్గా నాగేశ్వర రావు నియామకాన్నిసవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టు గడపను తొక్కిన విషయం తెలిసిందే.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications