ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు తీర్పు: ప్రధాని మోడీ స్పందన
ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మూడుసార్లు తలాక్‌పై గౌరవనీయమైన సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సమనత్వాన్ని తీసుకొచ్చిందని, మహిళాసాధికారతకు ఇదో నిదర్శనమని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

సుప్రీం తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేసింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ట్రిపుల్ తలాక్ రాజ్యంగబద్ధం కాదని, ఆరు నెలలపాటు దానిపై నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications