న్యూ రూల్స్ - ఇకపై ఏప్రిల్ నుంచే స్కూల్స్ ప్రారంభం
సాధారణంగా ఏప్రిల్ లో స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటిస్తారు. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్‌లో పాఠశాలలు తెరుచుకోవడం ఆనవాయితీ. అయితే ఈ రూల్ మారనుందా..? అవుననే అంటోంది గోవా ప్రభుత్వం. అవును.. ఈసారి గోవాలోని పాఠశాలలు జూన్‌కు బదులుగా ఏప్రిల్ నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గోవా విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త మార్పుతో చాలా మంది విద్యార్థులు సంతోషంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
అయితే మండు వేసవిలో పాఠశాలలు తెరవడాన్ని పలువురు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. అయినా గోవాలో సోమవారం(ఏప్రిల్ 7) నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయి. దాదాపు 90 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని అధికారులు స్పష్టం చేశారు.

జాతీయ విద్యా విధానం- 2020లో భాగంగానే గోవా విద్యా సంవత్సరాన్ని కాస్త ముందుకు జరిపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గోవాలో 2,153 పాఠశాలలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి 6 నుంచి 12 తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications