యూకేలో రేప్, అత్యాచార యత్నం: ఢిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: స్కాట్లాండ్‌లో వరుస అత్యాచారాలకు పాల్పడి తప్పించుకు వచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, భారత సంతతికి చెందిన రమీందర్ సింగ్ (28)ని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులు, అత్యాచారయత్నం తదితర కేసులు రమీందర్ సింగ్‌పై నమోదయ్యాయి.
స్కాట్లాండ్ పోలీసులు సమాచారం మేరకు సింగ్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. యుకేలో ఉన్నత చదువులు చదువుకొనేందుకు వెళ్లిన సింగ్, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. అతను బస చేసిన హాస్టల్‌లోని యువతే తొలి బాధితురాలని, మరో యువతిని పబ్‌లో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోగా, ఆమె ప్రతిఘటించడంతో దవడ ఎముకలు విరగొట్టాడని తెలిపారు.

ఇలా పలు కేసులు సింగ్‌పై నమోదు కావడంతో అక్కకి నుంచి తప్పించుకొని వచ్చి చంఢీగడ్, పంజాబ్ రాష్ట్రల్లో నకిలీ గుర్తింపుతో నివాసం ఉన్నట్లు వెల్లడించారు. సింగ్‌పై యూకే ప్రభుత్వం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు.
రమీందర్ సింగ్ అరెస్టైన విషయాన్ని బ్రిటిష్ హై కమిషన్‌కు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications