3 ఏళ్ళ బాలికపై సెక్కూరిటీ గార్డు అత్యాచారయత్నం, అరెస్టు
కోచి: కాపాడాల్సిన కనురెప్పలే కాటు వేశాయి. అభం శుభం తెలియని పసి బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.ఆడుకొంటున్న బాలికకు మాయమాటలు చెప్పి సెక్కూరిటీ గార్డు ఈ దురాగతానికి పాల్పడిన ఘటన కోచిలో చోటుచేసుకొంది.
ప్లే స్కూల్ లో తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకొంటారని వదిలేసిన తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వాస్తవం తెలిసింది. ప్లే స్కూల్ లో సెక్కూరిటీ గార్డుగా ఉన్న వ్యక్తే తమ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని గుర్తించారు.
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైతే తమ పిల్లల ఆలనా పాలనా చూసుకొనేందుకుగాను చైల్డ్ కేర్ సెంటర్ లేదా ప్లే స్కూళ్ళను ఆశ్రయిస్తార. కాని,కేరళ రాష్ట్రంలోని ఓ ప్లే స్కూల్ లో ఘోరం చోటుచేసుకొంది. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోచి నగరానికి సమీపంలోని కక్కానడ్ లోని ఓ బేబీ కేర్ సెంటర్ లో తల్లిదండ్రులు తమ కూతురును చేర్పించారు.ఈ సెంటర్ కు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తి మూడేళ్ళ చిన్నారిపై పడింది. నవంబర్ మూడవ తేదిన ఆ బాలిక ఆడుకొంటుండగా 62 ఏళ్ళ సెక్యూరిటీ గార్డు ఆ బాలికను బేబీ కేర్ సెంటర్ లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఇంటికి వచ్చిన బాలిక తన మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే అత్యాచారయత్నం జరిగినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నిందితుడైన చంద్రఖేఖర్ నీలకందన్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications