నేత్రావతి నది: తాగు నీటి కోసం బిగ్ ఫైట్
మంగళూరు: నేత్రావతి నది నీటి విషయంలో కన్నడిగుల మధ్య బిగ్ ఫైట్ మొదలైయ్యింది. నీటి పంపిణి విషయంలో పోరుగు రాష్ట్రాలతో కర్ణాటక గొడవ పడుతున్న విషయం తెలిసిందే. అయితే నేత్రావతి నది నీటిని కర్ణాటకలోని పలు జిల్లాలకు తాగు నీరు సరఫరా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పుడు ఈ విషయం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. ఈనెల 15వ తేదిన దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడి ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న జాతీయ రహదారి -75 ఒక రోజు పూర్తిగా మూసివేసి ధర్నా నిర్వహించాలని అక్కడి ప్రజలు సిద్దం అయ్యారు.
పార్టీలకు అతీతంగా ఈ ధర్నాలో పాల్గోనాలని నేత్రవాతి నది నీటి మళ్లింపు ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ డాక్టర్ నిరంజన్ రై పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు ఇప్పటి నుంచి ఈ కమిటి నాయకుల కార్యకలాపాల మీద నిఘా వేశారు.

బెంగళూరు గ్రామీణ, కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, తుమకూరు జిల్లాలలో 24 టీఎంపీల తాగు నీరు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు నేత్రావతి నది నీటి మళ్లింపు ప్రాజెక్టుకు 2014 మార్చి నెలలో శంకుస్థాపన చేశారు.
అప్పటి నుంచి దక్షణి కన్నడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సాటి కన్నడిగులు అయినా సరే నేత్రావతి నది నీరు మళ్లించడానికి వీలు లేదని పోరాటం చేస్తున్నారు. కర్ణాటకలోని పలు జిల్లాల ప్రజలు ఇప్పుడు నేత్రావతి నది నీరు కోసం ఆందోళనకు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications