ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టు భారీ షాక్-పిటిషన్ కొట్టివేత-అసలు శివసేనను తేల్చనున్న సీఈసీ..
శివసేన అసలు హక్కుదారులెవరో తేల్చే విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అసలు శివసేన ఏదో తేల్చే అధికారం సీఈసీకి ఉందా లేదా అనే అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. అసలు శివసేన ఏదో తేల్చేందుకు సీఈసీకి అధికారం ఉన్నట్లు సుప్రీం తెలిపింది.
శివసేనలో తిరుగుబాటు తర్వాత అధికారం దక్కించుకున్న ఏక్ నాథ్ షిండే వర్గం తమదే అసలు శివసేన అంటూ వాదన మొదలుపెట్టింది. అయితే బాల్ థాక్రే వారసుడిగా తనకే శివసేనపై హక్కు ఉందంటూ ఉద్ధవ్ థాక్రే అభ్యంతరం తెలిపారు. దీనిపై సీఈసీ వద్ద తమకు న్యాయం జరగదని భావించిన ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో సీఈసీ చర్యలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే ఉద్ధవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. దీంతో ఉద్ధవ్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగలగా.. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి ఊరట దక్కింది.

అసలు శివసేనను తేల్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని, సీఈసీ చర్యలపై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. దీంతో శివసేనపై నిర్ణయాధికారం సీఈసీ కోర్టులోకి వెళ్లినట్లయింది. శివసేనలో తిరుగుబాటు తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండే వైపు మళ్లడంతో సీఈసీ కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీన్ని ముందే ఊహించిన ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా ఊరట దక్కకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతీయ పార్టీ పెట్టుకోవడం మినహా ఉద్ధవ్ థాక్రేకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications