రియాద్, దోహా సహా భారత్ నుంచి గల్ఫ్ కు వెళ్లే పలు విమానాల రద్దు

సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. భారీ దాడికి దిగారు. మిస్సైళ్లు, డ్రోన్ దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 309 మంది వరకు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఈ దాడులన్నీ కూడా ప్రధానంగా రాజధాని రియాధ్ లోని కింగ్ ఖాలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా సాగాయి.

గల్ఫ్ రూట్ పై ప్రభావం..

ఈ తాజా పరిణామాలు భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే పలు విమానాలపై తీవ్రంగా పడింది. భారత్ నుంచి వేర్వేరు దేశాలకు నడిచే విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక్క కేరళలోని కోచి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన దాదాపు 10 విమాన సర్వీసులు ఇప్పటికిప్పుడు స్తంభించిపోయాయి. ఈ ఉదయం బయలుదేరి వెళ్లాల్సిన విమానాలన్నీ నిలిచిపోయాయి. ఈ నెల 13 వరకు మూడు రోజుల పాటు ఆయా సర్వీసుల రద్దయినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

Several Flights From Kerala to Saudi Arabia and Doha Cancellations as Middle East Conflict Escalates

భద్రతపై ఆందోళనలు..

యుద్ధ వాతావరణం, వైమానిక మార్గాల్లో నెలకొన్న భద్రతా ఆందోళనలు విమానయాన సంస్థలను కలవరపెడుతున్నాయి. ప్రయాణికులు, విమాన సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌లైన్స్ ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోని ప్రధాన నగరాలైన రియాద్, జెడ్డా, దోహా, రస్ అల్ ఖైమా మార్గాల్లో వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం పడింది. గల్ఫ్ లో ఉద్యోగాలు చేసుకునే ప్రవాస భారతీయులు, అత్యవసర పనులపై ప్రయాణమయ్యే వారు ఈ హఠాత్ పరిణామంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి
సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి

వ్యయభారం..

ఈ విమానాల నిలిపివేత వల్ల అకాశ ఎయిర్ అత్యధికంగా ప్రభావితమైంది. మొత్తం రద్దయిన 10 సర్వీసుల్లో అయిదు సర్వీసులు ఈ సంస్థకు చెందినవే. వీటితో పాటు ఫ్లైనాస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా తమ సర్వీసులను రద్దు చేశాయి. పశ్చిమాసియాలో కొన్ని దేశాల గగనతలాల్లో ఆంక్షలు విధించడం, ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం వ్యయభారంతో కూడుకున్నది కావడం కూడా ఈ రద్దులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇక చెన్నై వడపళని వరకూ మెట్రో రైల్: విజయ్ తో కలిసి ప్రారంభించిన ప్రధాని మోదీ: రైలు ప్రయాణం
ఇక చెన్నై వడపళని వరకూ మెట్రో రైల్: విజయ్ తో కలిసి ప్రారంభించిన ప్రధాని మోదీ: రైలు ప్రయాణం

రద్దయిన విమానాల్లో..

  • ఫ్లైనాస్- ఎక్స్ వై 399/ ఎక్స్ వై 400- కోచి- రియాద్
  • ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్- ఐఎక్స్ 476/ ఐఎక్స్ 475- దోహా- కోచి
  • అకాశ ఎయిర్ క్యూపీ 523/ క్యూపీ 550 కోచి- రియాద్/ కోచి- జెడ్డా
  • ఇండిగో 6ఈ 1517 కోచి- రస్ అల్ ఖైమా
  • అకాశ ఎయిర్ క్యూపీ 551/ క్యూపీ 524/ క్యూపీ 523 జెడ్డా- కోచి/ రియాద్- కోచి/ కోచి- రియాద్
  • అకాశ ఎయిర్ క్యూపీ 524 రియాద్- కోచి విమానాలు ఉన్నాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+