ఇక చెన్నై వడపళని వరకూ మెట్రో రైల్: విజయ్ తో కలిసి ప్రారంభించిన ప్రధాని మోదీ: రైలు ప్రయాణం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తోన్నారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి విజయ్.. సాదరంగా ఆయనను ఆహ్వానించారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. వీటిల్లో మెట్రో రైల్ ఫేస్ 2 విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, నగరాభివృద్ధిని వేగవంతం చేయడం వంటివి ఉన్నాయి.

చెన్నై మెట్రో ఫేజ్ 2లో భాగంగా పూనమల్లి- వడపళని రూట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు రూ. 4,900 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కారిడార్‌ ఇది. 3.7 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక డబుల్ డెక్కర్ స్ట్రక్చర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డ్రైవర్ రహిత రైళ్లు ఇవన్నీ కూడా. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో అవి పని చేస్తాయి. పోరూర్ బైపాస్ నుంచి పూనమల్లీ స్టేషన్ వరకు ప్రధాని మోదీ, విజయ్ మెట్రో రైలులో ప్రయాణించారు.

PM Modi and Tamil Nadu CM Vijay travel together on the newly inaugurated Chennai Metro Phase 2 train

అనంతరం రోడ్ కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా రూ. 3,700 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఎన్ హెచ్ 744 పరిధిలో వడుగపట్టి- తెరక్కువెంగనళ్లూర్ స్ట్రెచ్ మధ్య 36 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని ఆయన ప్రారంభించారు. అలాగే ఎన్ హెచ్ 744ఏ పరిధిలోని 30 కిలోమీటర్ల మధురై రింగ్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు నాగాపట్నం- తంజావూరు మధ్య ఎన్ హెచ్ 83పై నాలుగు లేన్ల తిరువారూర్ బైపాస్ నిర్మాణాన్నీ ప్రారంభించారాయన.

నార్త్ కొరియాలోనే ఇలాంటివి చూడగలుగుతాం: ప్రశ్నించిన వాళ్లు పరాయి దేశస్తులవుతారా: ధృవ్ రాఠీ
నార్త్ కొరియాలోనే ఇలాంటివి చూడగలుగుతాం: ప్రశ్నించిన వాళ్లు పరాయి దేశస్తులవుతారా: ధృవ్ రాఠీ

అలాగే రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ. 750 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. రైల్ కనెక్టివిటీని పెంచే కారైకాల్-పేరళం నూతన రైల్వే లైన్‌, కోయంబత్తూర్ సమీపంలో నిర్మించిన మూడు కీలక రైల్వే ఫ్లైఓవర్లను లాంఛనంగా జాతికి అంకితం చేశారు. తమిళనాడులోని ప్రధాన ఓడరేవుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. చెన్నై పోర్ట్, చిదంబరనార్ పోర్ట్, కామరాజర్ పోర్ట్ లల్లో సరుకు నిల్వ సామర్థ్యం పెంపు, క్రూయిజ్ టెర్మినల్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మోదీ చెన్నైలోని ప్రసిద్ధ జలకంఠేశ్వరాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసుకుని పూజలు చేశారు. దీని తర్వాత ఐఐటీ మద్రాస్‌లోని బ్రెయిన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ సాగుతున్న పరిశోధనా పురోగతి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. దీనితో పాటు చెన్నై జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+