వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసాజ్ సెంటర్లలో వ్యభిచార దందాలో కొత్త కోణాలు .. అమ్మాయికో రేట్ కార్డ్ .. షాక్ అయిన మహిళా కమీషన్

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో మసాజ్ సెంటర్ల ముసుగులో సాగుతున్న వ్యభిచార దందా సంచలనం సృష్టించింది. ఇక మసాజ్ సెంటర్ల పేరుతో జరుగుతున్న వ్యభిచార దందాలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మసాజ్ సెంటర్లలో కండోమ్ ల తో పాటు, అమ్మాయిల అశ్లీలఫోటోలతో ఉన్న రేట్ కార్డులు లభించడంతో మహిళా కమిషన్ సైతం షాక్ అయింది.

సుఖ పురుషులకు సొంపైన వార్త..! మసాజ్ చేసేందుకు ఇంటికే వచ్చిన యువతులు..! తర్వాత షాక్..!! సుఖ పురుషులకు సొంపైన వార్త..! మసాజ్ చేసేందుకు ఇంటికే వచ్చిన యువతులు..! తర్వాత షాక్..!!

 మసాజ్ సెంటర్ లపై మహిళా కమీషన్ ఆకస్మిక దాడులు

మసాజ్ సెంటర్ లపై మహిళా కమీషన్ ఆకస్మిక దాడులు

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా వ్యభిచార దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. పైకి స్పా లాగా కనిపించే పలు కేంద్రాలలో హైటెక్ వ్యభిచార దందా నడుస్తోంది . ఇక ఈ వ్యభిచార దందా పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపడానికి యుద్ధం ప్రకటించారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వందల సంఖ్యలో స్పాల పేరుతో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయని పేర్కొన్న మహిళా కమిషన్ ఆదేశాలతో దేశ రాజధాని ఢిల్లీలోపోలీసులు చేపడుతున్న రైడింగ్‌లో పెద్దమొత్తంలో స్పాలలో సెక్స్ రాకెట్ దందాలు బట్టబయలు అయ్యాయి. తాజాగా మహిళా కమీషన్ సభ్యుల బృందం జరిపిన ఆసక్మిక దాడులలో సైతం భారీ సెక్స్ రాకెట్ బయటపడింది.

స్పాలలో సెక్స్ రాకెట్స్ పై మహిళా కమీషన్ కొరడా

స్పాలలో సెక్స్ రాకెట్స్ పై మహిళా కమీషన్ కొరడా

దీంతో ఈ దందాలపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెక్స్ రాకెట్ దందాలపై వివరణ ఇవ్వాలని ముగ్గురు ఢిల్లీ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.అంతేకాకుండా, స్పాలల్లో సెక్స్ రాకెట్ దందాకు పోలీసులు కూడా కారణమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యభిచారం భూతాన్ని తరిమి కొట్టే వరకు నిద్రపోమని మహిళా కమిషన్ పేర్కొనడం చూస్తే ఢిల్లీ కేంద్రంగా ఈ అశ్లీల దందా ఎంత ఎక్కువగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

బురారీలో మసాజ్ సెంటర్లలో కండోమ్ లతో పాటు రేటు కార్డులు

బురారీలో మసాజ్ సెంటర్లలో కండోమ్ లతో పాటు రేటు కార్డులు

ఇక తాజాగా ఢిల్లీలోని బురారీ ప్రాంతాలను మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని బృందం ఆ మసాజ్ సెంటర్లలో దొరికిన వాటిని చూసి షాక్ అయ్యారు. అక్కడ కండోమ్ లతో పాటు అశ్లీల ఫోటోలతో ఉన్న అమ్మాయిల రేటు కార్డులు లభించాయి. ఇక వాటిపై అమ్మాయి కో రేట్ ఫిక్స్ చేసి ఉంది. యువతుల అశ్లీల ఫోటోలతో పాటు ఎవరి రేటు ఎంత అన్నది పేర్కొంటూ రేటు కార్డులు ఉండడం మహిళా కమిషన్ కు షాకింగ్ అనిపించింది.

వ్యభిచార భూతాన్ని తరిమేందుకు మహిళా కమీషన్ యత్నం

వ్యభిచార భూతాన్ని తరిమేందుకు మహిళా కమీషన్ యత్నం

గతంలోనూ బురారి లోని మసాజ్ పార్లర్ నుండి వ్యభిచార కూపంలోకి దించిన నలుగురు యువతులను మహిళా కమిషన్ కాపాడింది. ఇప్పుడు కూడా ఆకస్మిక దాడులు చాలామంది మహిళలను ఈ రొంపి నుండి బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది మహిళా కమిషన్. ఇక తాజాగా మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు కావటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాదు వ్యభిచార రొంపిలో ఉన్న వారికి అందులో నుండి బయటకు రావటానికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించటం , అవగాహనా కార్యక్రమాలు కల్పించటం సైతం చేస్తుంది మహిళా కమీషన్ .

English summary
Delhi Commission of Women busted a sex racket operating under the garb of a massage parlour. The raiding party was led by DCW chief Swati Maliwal. Condoms and rate cards were also found from the raided premises. As per DCW officials, obscene photos of girls with a rate card for each of them was found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X