Pic Talk: ఇదీ ఈ దేశంలో దాగిన అందం: షారుఖ్ ఖాన్ ఫొటో వైరల్

ముంబై: ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ పార్థివ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు లతా మంగేష్కర్‌కు తుది వీడ్కోలు పలికారు. ఆమె పార్థివదేహానికి నివాళి అర్పించారు. లత సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు సాగాయి. హృదయనాథ్ మంగేష్కర్ చితికి నిప్పంటించారు.

బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి లతా మంగేష్కర్ పార్థివదేహాన్ని తొలుత ఆమె నివాసం ప్రభుకుంజ్‌కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లతా మంగేష్కర్‌ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యుల తుది నివాళి కోసం ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా దారి మొత్తం వేలాది మంది అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. అనంతరం లతా మంగేష్కర్‌ నివాసానికి చేరుకున్న సైనికాధికారులు.. ఆమె పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి వందనాన్ని అర్పించారు.

సైనిక బ్యాండ్‌ ద్వారా జాతీయగీతాన్ని ఆలపించారు. కడసారిగా లతా మంగేష్కర్‌ను చూడటానికి బాలీవుడ్ సంగీత ప్రపంచం ఆమె నివాసానికి తరలి వచ్చింది. అనంతరం.. అంతిమ యాత్ర మొదలయింది. ప్రభుకుంజ్ నుంచి శివాజీ పార్క్ వరకు అంతిమయాత్ర సాగింది. వేలాదిమంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. కన్నీటి వీడ్కోలు పలికారు. లతా మంగేష్కర్ అమర రహే అంటు నినదించారు. శివాజీ పార్క్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో లత మంగేష్కర్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Shahrukh Khan and his manager Pooja Dadlani pays tribute to Lata Mangeshkar mortal remains, photo viral

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌ పవార్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రి ఆదిత్య థాకరే, పలువురు మంత్రులు, లెజెండరీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, ఆయన మేనేజర్ పూజా దద్లాని, అమీర్‌ఖాన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. లతా మంగేష్కర్‌కు తుది నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్, తన మేనేజర్ పూజా దద్లానీతో కలిసి లతా మంగేష్కర్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి కలగాలంటూ షారుఖ్ ఖాన్- ముస్లిం సంప్రదాయంలో చేతులు ముడిచి అల్లాకు దువా చేయగా.. ఆయన పక్కనే నిల్చున్న పూజా దద్లాని హిందూ సంప్రదాయంలో చేతులు జోడించి ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

నిజమైన భారత ఆత్మ.. ఇక్కడ ప్రస్ఫూటితమైందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. అన్ని భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి.. అన్ని కులాలు, అన్ని మతాలవారి కుటుంబంలో ఒకటిగా మెలిగిన లతా మంగేష్కర్‌కు దేశ ప్రజలు ఇచ్చిన ఓ గొప్ప నివాళిగా అభివర్ణిస్తున్నారు. గాత్రానికి కులం, మతం అనేది లేదని, అలాగే- భారత గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్కరూ సమానమేనని కామెంట్స్ చేస్తోన్నారు. భారతరత్నకు ఇదే నిజమైన నివాళిగా పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+