వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shani Jayanti 2021: శనీశ్వరుడి అనుగ్రహం పొందడం ఎలా.. ఎలాంటి పూజలు చేయాలి..?

|
Google Oneindia TeluguNews

సాధారణంగా మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే.. లేదా ఓ కార్యం తలపెట్టినప్పుడు చివరి వరకు వచ్చి విఫలమైతే... శని తాండవిస్తున్నట్లున్నాడు అని చెబుతుంటాం. కొన్ని సందర్భాల్లో శని నెత్తిమీద ఉంటే ఏ కార్యము జరగదని మన పెద్దలు చెబుతుండటం కూడా వినే వింటాం. అవును శని అనుగ్రహం ఉంటే ఏదైనా సరే సాధించగలుగుతాం. మన వ్యక్తిగత జీవితం, వృత్తిపరంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయంటే మనపట్ల శనిదేవుడు కరుణ చూపడం లేదని అర్థం. అందుకే శని దేవుడిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. జూన్ 10వ తేదీన శని జయంతి. సాధారణంగా వారంలో ఒకసారి అంటే శనివారం రోజున శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

 శనీశ్వరుడి కథ

శనీశ్వరుడి కథ


సూర్య ఛాయాలకు జన్మించాడు శనీశ్వరుడు. ఇతనికి ఖర్మ భగవానుడు అని మరో పేరు కూడా కలదు. శనీశ్వరుడు చాలా పవర్‌ఫుల్ దేవుడిగా చెబుతుంటారు. మంచి మార్గంలో నడిచేవారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని అదే వక్రదారిలో పోయి చెడు చేయాలనుకునేవారికి మాత్రం అదే రేంజ్‌లో శిక్ష విధిస్తారని చెబుతారు. ఇక శనీశ్వరుడి జన్మదినంను శని జయంతిగా జరుపుకుంటున్నాం. ఈ సారి శని జయంతి జూన్ 10వ తేదీ వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం 2021లో శని జయంతి జేష్ఠ్య నెలలో అమావాస్య రోజున వచ్చింది. ఇక గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మే నెల లేదా జూన్ నెలలో శని జయంతి వస్తుంది.

శని జయంతి 2021: తేదీ సమయం

శని జయంతి 2021: తేదీ సమయం

ఈ ఏడాది శని జయంతి జూన్ 10వ తేదీన పడింది. అమావాస్య జూన్ 9వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 57 నిమిషాలకు ప్రారంభమైంది. ఇది జూన్ 10వ తేదీ సాయంత్రం 4 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఇక శని జయంతి రోజున ఎలాంటి పూజా విధానాలు పాటించాలనేది కూడా తెలుసుకుందాం. శని జయంతి రోజున పలు రకాల పూజలను దేశవ్యాప్తంగా చేస్తారు. శని జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యజ్ఞాలు, హోమంలు కూడా చేస్తారు. ఈ పూజలను సాధారణంగా శని ఆలయాల్లో లేదా నవగ్రహ దేవాలయాల్లో చేస్తారు. భక్తులు దీపంను వెలిగించి శని దేవుడి ముందు ఉంచి శని మంత్రాన్ని పటిస్తారు. ఇలా చేయడం ద్వారా జీవితంలో సక్సెస్ వస్తుందని బలంగా విశ్వసిస్తారు. కొందరైతే 11వేల సార్లు మంత్రాన్ని పటించి శనిదేవాలయాన్ని దర్శించుకుంటారు.

శని అంటే ఏంటి..? పేరెలా వచ్చింది..?

శని అంటే ఏంటి..? పేరెలా వచ్చింది..?


శని అనే పేరు శనైశ్చార్యా నుంచి వచ్చింది. సంస్కృతంలో కదలిక అని దీనర్థం. శని అనేది ఒక గ్రహం. చారా అంటే కదలిక. అంటే సూర్యుడిని చుట్టేందుకు శని గ్రహం 30 ఏళ్లు సమయం తీసుకుంటుంది. అందుకే శని జయంతిని శనిశ్చార్య జయంతి అని కూడా పిలుస్తారు. శనిదేవుడిని ఎక్కువగా శనివారం రోజున పూజించడం జరుగుతుంది. తమకు ఎలాంటి కీడు జరగకూడదని, జీవితంలో అంతా మంచి జరగాలని పూజిస్తారు.

English summary
Shani Jayanti falls on June 10th and many people perform different poojas on this day to please shani god.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X