మీ కబోర్డ్‌లో చీరలు లేవా.. "ఏఐ శారీ ట్రెండ్‌"పై సంచలన కామెంట్స్ !

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. వెనుకటికి ఒక సామెత ఉంటది.. ఏంటంటే "పని లేని వ్యక్తి కూర్చొని పిల్లి వెంట్రుకలు లెక్కబెట్టాడు" అన్నట్టు.. అలానే ఉంటుంది ప్రస్తుతం కాలంలో చాలామంది వ్యవహారం. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా చేయడం ఆలస్యం.. పోలోమని అందరూ ఎగబడి అదే పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా "నానో బనానా" ట్రెండ్‌ వైరల్‌ అవుతోంది.

ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ఫొటో ఎడిటింగ్‌ టూల్‌లో రెట్రోలుక్‌ శారీ ట్రెండ్‌ ను నెటిజన్లు తెగ వినియోగిస్తున్నారు. తమ ఫొటోలను రెట్రో లుక్‌లో కనిపించేలా ప్రాంప్ట్‌ ఇచ్చి ఇమేజ్‌ ఎడిట్‌ చేసుకొని సంబరపడిపోతున్నారు. దీనిపై దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, యువ మిత్రుడు శంతను నాయుడు సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

shantanu-naidu-shockng-comments-on-ai-saree-trend

ఏమన్నారంటే.. సగటు భారతీయ మహిళల కబోర్డులో కనీసం 15 రకాల చీరలు ఉంటాయని.. వాటిని ధరించకుండా ఏఐలో శారీట్రెండ్‌తో ఫొటోలు దిగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చీరలో కనిపించాలని అంత ఇష్టం ఉన్నవారు వారి కబోర్డులోని చీరలు కట్టుకొని ఫొటోలు దిగితే సరిపోతుంది కదా అని తెలిపారు. నిజమైన చీర కట్టుకొని ఫోటోలు తీసుకోవచ్చని.. అందుకు ఏఐని వినియోగించడం ఎందుకని కామెంట్స్ చేశారు. ఎప్పుడూ ధరించని దుస్తుల్లో తమ చిత్రాలను రూపొందించమని ఏఐని అడిగితే పర్లేదనుకోవచ్చని.. అందరి వద్ద ఉండే చీరల్లో పిక్స్ కోసం ఏఐని వినియోగించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.

కాగా దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా శంతను నాయుడు ఫేమస్ అయ్యారు. శంతను తన ఆటో మొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీని సావిత్రి బాయి పూలే పుణె యూనివర్సిటీలో 2014 లో పూర్తి చేశారు. ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీని 2016 లో అందుకున్నారు.

వీధి శునకాలను వేగంగా వెళ్లే కార్ల నుంచి ఎలా రక్షించవచ్చో ఒక కొత్త సాంకేతికతను 2014 లో డెవలప్ చేసిన క్రమంలో రతన్ టాటా దృష్టిని ఆకర్షించారు. 2018 లో రతన్ టాటా సహాయకుడిగా చేరి తర్వాత క్లోజ్ ఫ్రెండ్‌గా మారారు. ప్రస్తుతం ఆయన టాటా మోటార్స్‌లో స్ట్రాటజిస్ట్ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+