వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: అమిత్ షాతో పవార్ సీక్రెట్ భేటీ? 'మహా' ప్రభుత్వంలో కలకలం.. ఎన్సీపీపై శివసేన డైరెక్ట్ ఎటాక్!

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. అమిత్ షాతో శరద్ పవార్ భేటీని ఎన్సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ... దేశంలో ఒక దిగ్గజ నేతగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు విస్తృత సంబంధాలు ఉంటాయని చెప్తుండటం గమనార్హం. మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలు కూడా తాజా ప్రచారానికి ఊతమిస్తున్నాయి. పవార్‌తో భేటీపై స్పందించేందుకు నిరాకరించిన అమిత్ షా... అన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీన్నిబట్టి అమిత్ షా-పవార్ భేటీ నిజమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఎన్సీపీ శ్రేణులు ఏమంటున్నారు...

ఎన్సీపీ శ్రేణులు ఏమంటున్నారు...

'అమిత్ షా-పవార్ భేటీ పూర్తి అయ్యారన్న ప్రచారం పూర్తిగా నిరాధారపూరితమైనది. అయితే దేశంలో ఒక సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పార్టీల నేతలతో స్నేహపూర్వక సంబంధాలు గతంలో కూడా ఉన్నాయి. చాలాసార్లు ఆయా నేతల ఇళ్లకు కూడా పవార్ వెళ్లారు. దివంగత ప్రధానులు చంద్రశేఖర్,అటల్ బిహారీ వాజ్‌పేయి,అలాగే దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు,జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి డా.ఫరూఖ్ అబ్దుల్లా,దివంగత ఒడిశా సీఎం బిజూ పట్నాయక్,బీజేపీ నేత ప్రమోద్ మహాజన్... ఇలా ఎంతోమందితో ఆయన సత్సంబంధాలు కొనసాగించారు.' అని మంత్రి,ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.

అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంలో విభేదాలు...

అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంలో విభేదాలు...

ఇటీవల అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం రేపిన ఘటన అనేక మలుపులు తిరిగి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల వరకు వచ్చిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి లేఖ రాశారు. ఆ లేఖ మహా రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ఉద్దవ్ థాక్రే చర్యలు తీసుకోవచ్చునన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అనిల్ దేశ్‌ముఖ్ పదవిలోనే కొనసాగుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు. అయితే అంతిమ నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిదేనని తెలిపారు. ఈ విషయంలో శివసేన,ఎన్సీపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఎన్సీపీపై శివసేన మౌత్ పీస్...

ఎన్సీపీపై శివసేన మౌత్ పీస్...


శివసేన మౌత్ పీస్ సామ్నాలో తాజాగా ప్రచురితమైన ఎడిటోరియల్ కూడా మహా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మహావికాస్ అఘాడీలోని భాగస్వామ్య పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయాయా అన్నట్లుగా ఆ వ్యాసం సాగింది. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను యాక్సిడెంటల్ హోంమంత్రి అని పేర్కొనడం... అవినీతి ఆరోపణలు,అనేక సందేహాలు చుట్టుముట్టిన తర్వాత ఇంకా ఆ కుర్చీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించడం.. ఎన్సీపీ వైఖరిపై శివసేన అసంతృప్తిని,అసహనాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒకరకంగా ఎన్సీపీపై ఇది నేరుగా దాడి చేయడమేనన్న వాదన వినిపిస్తోంది.సచిన్ వాజే లాంటి ఒక అధికారి వసూళ్ల దందా నడుపుతున్నప్పుడు హోంమంత్రికి దాని గురించి తెలియకపోవడమేంటని సామ్నా వ్యాసంలో శివసేన ప్రశ్నించింది. అంతేకాదు,మూడు పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నప్పుడు... ఎవరూ దాన్ని చెడగొట్టేలా వ్యవహరించకూడదని పేర్కొంది. అంటే,పవార్‌ను ఉద్దేశించే శివసేన ఈ వ్యాఖ్యలు చేసిందా అన్న సందేహం తలెత్తుతోంది.

తప్పించాలని శివసేన భావించినా...

తప్పించాలని శివసేన భావించినా...


ఇక తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ... దీనిపై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు చెప్పడం గమనార్హం. నిజానికి అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే హోంమంత్రిపై వేటు వేయాలని శివసేన భావించింది...కానీ ఎన్సీపీ అందుకు భిన్నంగా స్పందించడంతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. అప్పటినుంచి శివసేన-ఎన్సీపీ మధ్య గ్యాప్ పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పవార్ అమిత్ షాతో భేటీ అయ్యారన్న ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహా రాజకీయాలు మున్ముందు ఏ మలుపు తిరగబోతున్నాయో అన్న చర్చ మొదలైంది.

English summary
Union Home Minister Amit Shah on Sunday left people guessing as he declined to confirm nor deny a purported secret meeting with Nationalist Congress Party (NCP) chief Sharad Pawar in the midst of a crisis in the Maharashtra coalition government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X