రాహుల్‌ గాంధీ సమస్య అదే - ప్రధాని పదవి రేసుపై శరద్ పవార్‌ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీకి గట్టి దెబ్బ కొట్టిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. కూటమిలో అక్కడక్కడా సమస్యలు ఉన్నా అంతిమంగా ఇబ్బంది లేకుండా పెద్దన్న పాత్ర పోషిస్తున్న శరద్‌ పవార్‌ తాజాగా ఇందులో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించి గతంలో ఆ పార్టీ నుంచి విడిపోయి సక్సెస్‌ అయిన శరద్‌ పవార్‌ చేసిన కామెంట్లు మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడిన పవార్‌... దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో రాహుల్‌ గాంధీ ఏ మేరకు సమర్ధుడు అన్న ప్రశ్నకు ఆయన స్ధిరత్వమే సమస్య అంటూ సమాధానం ఇచ్చారు.

Sharad Pawar casts doubts on Rahul Gandhis consistency

Recommended Video

    PM Modi To Chair Virtual All Party Meeting On Covid-19 Today | Oneindia telugu

    రాహుల్‌ గాందీకి స్దిరత్వం లోపించినట్లు కనిపిస్తోందని, పార్టీలో లుకలుకలు ముగిసి ఆయనకు స్పష్టమైన నాయకత్వం దక్కితే దీనికి కొంతమేర చెక్‌ పడొచ్చంటూ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నెహ్రూ-గాంధీ కుటుంబంపై ఉన్న నమ్మకం కూడా ఇందుకు కారణమన్నారు. తనపై తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందనపైనా పవార్‌ మాట్లాడారు. ఒబామా వ్యాఖ్యలను రాహుల్‌ అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్ పవార్‌ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+