మోడీకి పవార్ గుడ్ న్యూస్..! అర్ధరాత్రి సీఎంతో సీక్రెట్ భేటీ? డీలిమిటేషన్ బిల్లుపై కీలక పరిణామాలు.!
కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కలిపి తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో నెగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాల్ని విపక్ష ఇండియా కూటమి విజయవంతంగా అడ్డుకుంది. ఇందులో కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలన్నీ ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశాయి. దీంతో ఇప్పుడు వీటిలో పలు పార్టీల్ని చీల్చి, వాటి మద్దతుతో మరోసారి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలని చూస్తున్న ఎన్డీయేకు ఓ గుడ్ న్యూస్ అందింది.
గతంలో పార్లమెంట్ లో ఇవే బిల్లుల్ని వ్యతిరేకించిన శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) ఈసారి మాత్రం వాటికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కోసం మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలని పవార్ నిర్ణయించారు. పవార్ నిర్ణయం అమలైతే గత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయానికి గండి కొట్టినట్లేనని భావిస్తున్నారు.

ఎన్సీపీలో రెండు వర్గాలకు చెందిన సీనియర్ నేతలు శరద్ పవార్, సునేత్ర పవార్ .. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో రహస్యంగా అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించినట్లు ఇండియా టుడే కథనం వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ తిరిగి ఏకమై కేంద్రంలోని ఎన్డీయేకు ఏదో ఒక రూపంలో మద్దతు ఇస్తుందనే ఊహగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ఇవాళ పవార్ కుమార్తె సుప్రియా సూలే నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచి, దాని అమలును స్పష్టంగా వివరిస్తే, తాము దానికి మద్దతు ఇస్తామని సుప్రియా సూలే వెల్లడించారు.















Click it and Unblock the Notifications