మరుగుతున్న సాంబారు పాత్రలో పడి బాలిక మృతి

కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో గల చిక్‌బల్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. లంచ్ అవర్‌లో మిత్రులతో ఆడుకుంటూ బాలిక ప్రమాదవశాత్తు పాత్రలో పడిందని పాఠశాల అధికార వర్గాలు చెప్పాయి.
పాత్రలో పడిన అమ్మాయిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆమె శరీరం 70 శాతం కాలింది. ఆ గాయాలకు బాలిక ప్రాణాలు విడిచింది.
లంచ్ అవర్‌లో ఈ సంఘటన జరిగిందని, అమ్మాయిలు ఆడుకుంటుండగా బాలిక ప్రమాదవశాత్తు పాత్రలో పడిందని, వెంటనే ఆస్పత్రికి తరలించామని పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పినట్లు ఓ మీడియా సంస్థ వార్తాకథనంలో తెలిపింది.












Click it and Unblock the Notifications