ఆమె నాలో సగం: అధికారిక సమావేశాలకు భార్యతో సిద్ధు, అడిగితే ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

చండీగఢ్: పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. అధికారిక సమావేశాలకు భార్యతో కలిసి వచ్చారు. తన భార్య తనలో సగమని, అందుకే వెంట వచ్చారని సమర్థించుకున్నారు.

మంత్రి హోదాలో సిద్ధూ పాల్గొన్న అధికారిక సమావేశాల్లో ఆయన వెంట భార్య నవజోత్‌ కౌర్‌ కనిపించారు. దీంతో ఈ విషయమై బుధవారం మీడియా ఆయనను ప్రశ్నించింది. కౌర్‌ మంత్రిగానీ, ఎమ్మెల్యే గానీ కాదు కదా.. ఆమె అధికారిక సమావేశంలో ఎందుకు ఉన్నారు అని విలేకరులు ప్రశ్నించారు.

Navjot Singh Sidhu

దానికి ఆయన ఆమె నాలో సగం.. నా అర్ధాంగి అని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు. మరోవైపు దీనిపై కౌర్‌ కూడా స్పందించారు. పాలనా పరమైన అంశాల్లో తన భర్త కంటే తనకే ఎక్కువ అనుభవం ఉందన్నారు.

సిద్ధూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే సిద్ధు టీవీ షోలపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. సీఎం అడిగినా తాను టీవీ షోలో పాల్గొనడం ఆపేయనని ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Navjot Singh Sidhu has stirred up another controversy within a week of swearing in as Punjab minister by taking his wife along on official meetings.
Please Wait while comments are loading...