అధికార లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు.. తుది వీడ్కోలు పలికిన సోనియా, షా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. హితులు, సన్నిహితులు, కోలిగ్స్ తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షీలా దీక్షిత్ చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె .. గుండెపోటుతో మృతిచెందారు. దీక్షిత్ మృతిపై పార్టీలకతీతంగా నేతలు సంతాపం తెలిపారు. అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు.
తుది వీడ్కోలు ..
ఆస్పత్రిలో చనిపోయాక ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్‌లో గల నివాసానికి ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. ఇవాళ ఉదయం ఇంటివద్ద షీలా దీక్షిత్ పార్ధీద దేహం వద్ద నేతలు నివాళులర్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా, బీజేపీ నేతలు సుష్మ స్వరాజ్, ఎల్కే అద్వానీ, సీపీఐ నేత డీ రాజా అంజలి ఘటించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ నేతలు షీలా .. భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నిజామ్‌బోధ్ ఘాట్ వద్దకు షీలా దీక్షిత్ అంతిమ యాత్ర కొసాగింది. షీలా పార్థీదదేహం ఉంచిన వ్యానున తెల్లని మల్లెపూలతో అలంకరించారు. నేతలు, అభిమానులు వెంట రాగా షీలా దీక్షిత్ అంతిమ యాత్ర జరిగింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతక్రియల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాఘాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఢిల్లీ సీఎం అరంవిద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇతర నేతలు పాల్గొన్నారు. 1998 నుంచి 2013 వరకు వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు షీలా దీక్షిత్. ఆమె హయాంలోనే ఢిల్లీ గణనీయమైన అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన, రహదారులు నిర్మాణం, ఫ్లై ఓవర్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications