కమలేశ్ హంతకుల తల తీసుకొస్తే రూ.కోటి రివార్డు.. శివసేన నేత ప్రకటన
హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేశ్ తివారీని మట్టుబెట్టిన నిందితుల తల తీసుకొస్తే శివసేన నేత రివార్డు ప్రకటించారు. ముగ్గురి తల తీసుకొస్తే రూ.కోటి ఇస్తానని అరుణ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. హిందూ నేతను పట్టపగలు కార్యాలయంలో కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

అలానే చంపాలి
కమలేశ్ తివారీని ఎలా చంపారో వారిని కూడా అలాగే చంపాలని అరుణ్ అన్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేయడంలో ఏం లాభం లేదని అరుణ్ అన్నారు. కమలేశ్ తరహాలోనే వారిని కూడా మట్టుబెట్టాలని చెప్పారు. వారి తలలు తీసుకొచ్చిన వారి కుటుంబాలకు రూ.కోటి నగదు ఇస్తానని ప్రకటించారు.

మాట్లాడితే అంతేనా
కమలేశ్ తివారీ హిందూ నేత.. ఆయనను హతమార్చడం ఏంటీ అని అరుణ్ ప్రశ్నించారు. హిందువుల తరఫున మాట్లాడేవారిని చంపేస్తారా అని మండిపడ్డారు. కానీ తమ దేశంలో అలాంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కమలేశ్ తివారీ హిందూ మహాసభ నేత, అయోధ్య భూ వివాదాస్పద స్థలంలో కక్షిదారుగా ఉన్నారు. అయోధ్య కేసు వాదనలు పూర్తయి తీర్పు వెలువరించే సమయంలో కమలేశ్ హత్యకు గురవడం కలకలం రేగుతుంది.

సిట్ ఏర్పాటు
కమలేశ్ హత్య తర్వాత యూపీ సర్కార్ స్పెషల్ ఇన్వె్స్టిగేషన్ టీంను ఏర్పాటుచేసింది. ఇప్పటికే సూరత్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మౌలానా మోసిన్ షేక్, ఖుర్షిద్ అహ్మద్, ఫైజాన్ అనే ముగ్గురు కమలేశ్‌ను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. 2015లో మహ్మద్ ప్రవక్తపై కమలేశ్ తివారీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమలేశ్ హత్యకు గురయ్యారని యూపీ పోలీసులు బాస్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎలా జరిగిందంటే
లక్నోలోని తన కార్యాలయంలో కమలేశ్ ఉండగా శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు కాషాయ వస్త్రాలు ధరించి లోపలికి వచ్చారు. రెండు స్వీట్ బాక్సులు తమ వెంట తీసుకొచ్చారు. అందుల్లోంచి తుపాకీ తీసి కాల్చారు. తర్వాత కత్తితో గొంతు కోశారు. దాదాపు 15 సార్లు కత్తితో పొడిచినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాతే అక్కడినుంచి పారిపోయినట్టు విజువల్‌లో కనిపించింది. ఘటనాస్థలంలో పిస్టోల్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications