బీజేపీ-ఎంఐఎం రామ్ అండ్ శ్యామ్ జోడీ- రహస్య స్నేహంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విసుర్లు..
దేశవ్యాప్తంగా పలు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నట్లు నటిస్తూ కాంగ్రెస్ తో పాటు పలు సెక్యులర్ పార్టీల ఓట్లకు గండి కొడుతున్న ఎంఐఎంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.
శివసేనలో రెండు వర్గాల మధ్య పోరు ఇంకా కొనసాగుతోంది. షిండే, ఉద్ధవ్ వర్గాలు శివసేనను తమదంటే తమదని పోట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇరువర్గాలకు మంటపుట్టించాయి.
ఎన్సీపీ నేత అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు కాగలిగినప్పుడు.. ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి కొడుకుల పుణ్యంతో మాత్రమే నాయకుడు కాగలరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఏక్ నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ నాయకులు కాగలరు, మహారాష్ట్ర ముస్లింలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే,షిండేలా కాలేరా అని తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపీ ప్రశ్నించారు. నినాదాలు చేయడం ద్వారా మీరు ఒక్కటి కాలేరని అసద్ వారికి తెలిపారు. ఏకం అవ్వండి, ఓట్లు వేసి నాయకులుగా అవ్వండన్నారు.

బీజేపీ, అసదుద్దీన్ ఒవైసీలు రామ్ మరియు శ్యామ్ కీ జోడీ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ శివసేన ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. వీర్ సావర్కర్ మహారాష్ట్ర పురాణమని, అతను మహారాష్ట్ర యొక్క వీర కుమారుడని రౌత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నుంచి శివసేన వేరు పడిన తర్వాత శివాజీ గురించి, వీఆర్ సావర్కర్ గురించి బీజేపీ నేతలు తరచుగా ప్రశ్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్య సంచరించుకున్నాయి.












Click it and Unblock the Notifications