నందిని వివాదం: పాల రేట్ల పెంపు వేళ.. సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం
బెంగళూరు: కర్ణాటకలో నందిని బ్రాండ్ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన వివాదానికి తెర పడట్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే తెర లేచిన వివాదం ఇది. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే వస్తోంది. నందిని బ్రాండ్‌ను కాదని గతంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. గుజరాత్‌కు చెందిన అమూల్ అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో మొదలైన ఈ వివాదానికి పుల్ స్టాప్ పడట్లేదు.
కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) బ్రాండ్ నేమ్.. నందిని. ఇదే పేరుతో పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ప్రభుత్వం సొంతంగా నిర్వహిస్తోంది. ఇవ్వాళ్టి నుంచి వాటి రేట్లను పెంచింది. లీటర్ పాలపై మూడు రూపాయలను పెంచింది ప్రభుత్వం. టోన్డ్ మిల్క్ 39 నుంచి 42 రూపాయలు, హోమోజెనైజ్డ్ మిల్క్ 40 నుంచి 43 రూపాయలకు పెరిగింది.

పాశ్చరైజ్డ్ మిల్క్ 43 నుంచి 46 రూపాయలకు చేరింది. శుభం మిల్క్ 45 నుంచి 48 రూపాయలకు పెరిగింది. నెయ్యి, పెరుగు, మజ్జిగ పాకెట్ల ధరను కూడా ప్రభుత్వం సవరించింది. పెరిగిన ధరల ప్రభావం.. అటు తిరుమల తిరుపతి దేవస్థానంపైనా పడిన విషయం తెలిసిందే. నందిని ఘీ రేటు పెరగడం వల్ల శ్రీవారి లడ్డూ ఆ నెయ్యిని వినియోగించకూడదని టీటీడీ అధికారులు తీర్మానించారు.
ఇది కాస్తా రాజకీయ దుమారానికీ దారి తీసింది. రేట్ల పెంపు వ్యవహారంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) మండిపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ సీనియర్ నేత సీటీ రవి, జనతాదళ్ (ఎస్) నేతలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై భగ్గుమంటోన్నారు. టీటీడీ తన కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవడాన్నీ తప్పు పడుతున్నారు. 50 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోన్న టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ రద్దు కావడానికి ప్రభుత్వమే కారణమంటూ విమర్శిస్తోన్నారు.

ఈ పరిణామాల మధ్య సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నందిని మిల్క్ బ్రాండ్ అంబాసిడర్‌గా శాండల్‌వుడ్ సూపర్ స్టార్, హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కేఎంఎఫ్ ఛైర్మన్ భీమా నాయక్, ఎండీ బీసీ సతీష్.. శివరాజ్ కుమార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. అభినందనలు తెలిపారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శివరాజ్ కుమార్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహించారాయన అప్పట్లో. ఆయనను నందిని మిల్క్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications