Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబైలో నవనీత్ కౌర్ వర్సెస్ శివసేన-ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా హెచ్చరికతో

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది. ముంబైలోని సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానంటూ అమరావతికి చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు శివసేన కార్యకర్తలకుఆగ్రహం తెప్పించాయి. దీంతో ముంబైలో ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి.

ఇవాళ ఉదయం ముంబైలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా అపార్ట్‌మెంట్ వెలుపల శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి వ్యతిరేక నినాదాలు చేశారు. సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తామని ఈ దంపతులు ప్రకటించడంతో ప్రతిగా శివసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

shivsena workers protest at mp navneet kaurs residence after her comments on cm uddhav

శివసేన కార్యకర్తలు బారికేడ్లను ఛేదించుకుని సబర్బన్ ఖార్‌లోని ఎమ్మెల్యే దంపతుల నివాస ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, శివసేన కార్యకర్తలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా ఇద్దరూ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి స్వతంత్ర ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

shivsena workers protest at mp navneet kaurs residence after her comments on cm uddhav

నవనీత్ రాణా హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు సీఎం నివాసం 'మాతోశ్రీ' వెలుపల భద్రతను పెంచారు. అలాగే రద్దీని నివారించడానికి ఠాక్రే నివాసానికి వెళ్లే రహదారిపై బారికేడ్లు వేశారు. శివసేన కార్యకర్తలు నిరసనలు చేయడంతో పాటు నవనీత్ రాణా దంపతులను వారి నివాసం నుండి బయటకు రావాలని నినాదాలు చేయడంతో అపార్ట్‌మెంట్ బయట కూడా పోలీసు సిబ్బందిని మోహరించారు.నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని కోరుతూ ముంబై పోలీసులు నిన్న నవనీత్ రాణా దంపతులకు నోటీసులు ఇచ్చారు. 'మాతోశ్రీ'తో పాటు దక్షిణ ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం 'వర్ష' వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు.

అయితే శివసేన బెదిరింపులకు తలొగ్గేది లేదని నవనీత్ రాణా ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే శివసేన కార్యకర్తల్ని మమ్మల్ని గెలిపించమని చెప్పారు. అందుకే వారు మా అపార్ట్ మెంట్ బ్యారికేడ్లు ధ్వంసం చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+