Shock: వెండి గొలుసుల కోసం కాళ్లు నరికేశారు. కూతురు చూసి షాక్, ఎంతకు తెగించారంటే ?
జైపూర్/ రాజస్థాన్: దొంగతనం చెయ్యడానికి వెలుతున్న కిరాతకులు ఏమైనా చెయ్యడానికి సిద్దం అవుతారని మరోసారి వెలుగు చూసింది. వెండి గొలుసులు చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన దొంగలు వీలు కాకపోవడంతో ఆమె కాలు నరికేశారు. కాలు నరికేసి వెండి గొలుసులు చోరీ చేసి దర్జాగా వెళ్లిపోయారు.

వృద్దురాలు
రాజస్థాన్ లోని జైపూర్ లోని మీనా కాలనీలో 108 సంవత్సరాల వృద్దురాలు జమునా దేవి నివాసం ఉంటున్నారు. జమునా దేవితో పాటు ఆమె కుమార్తె, మనుమరాలు అదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. రాత్రి కుమార్తె, మనుమరాలితో కలిసి భోజనం చేసిన జమునా దేవి నిద్రపోయారు.

వెండి గొలుసుల కోసం కాలు నరికేశారు
వేకువ జామున తల్లి జమునా దేవి కనపడకపోవడంతో ఆమె కుమార్తె ఇంటి బయటకు వచ్చి చూశారు. జమునా దేవిని ఇంటి నుంచి బయటకు లాక్కొని వచ్చిన దొంగలు ఆమె కాలికి ఉన్న వెండి గొలుసులు లాక్కోవడానికి ప్రయత్నించారు. వెండి గొలుసులు రాకపోవడంతో జుమనా దేవి కాలు నరికేసి ఆమె కాలిలో ఉన్న వెండి గొలుసు లాక్కొని వెళ్లారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
తల్లి జమునా దేవి కాలు తెగిపోవడంతో హడలపోయిన కూతురు ఆమెను ఆసుపత్రికి తరలించారు. జమునా దేవి కాలు నరికేస్తున్న సమయంలో సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, నిందితుల కోసం గాలిస్తున్నామని జైపూర్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications