షాకింగ్: హనీమూన్ వెన్యూ విషయంలో వివాదం.. కొత్త అల్లుడిపై యాసిడ్ పోసిన మామ!
సమాజంలో రోజురోజుకీ మనుషుల ఆలోచన విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు.. ఎవరు.. ఎక్కడ.. ఎలా ప్రవర్తిస్తారు అనేది అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇటీవల కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేయటం ఇష్టం లేని వ్యక్తి తన చేతి వేళ్ళను నరికేసుకున్న ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. ఇక అదే తరహాలో తాజాగా మరో ఉదంతా ఇది విన్న వాళ్ళందరినీ నివ్వెర పోయేలా చేసింది.
కూతురు పెళ్లి చేసిన తండ్రి .. షాకింగ్ పని
ఎన్నో ఖర్చుపెట్టి కూతురికి పెళ్లి చేసిన ఓ తండ్రి కొత్త అల్లుడు పైన ప్రవర్తించిన తీరు సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని ఠాణే జిల్లా కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 65 సంవత్సరాల వయసున్న జకీ గులామ్ ముర్తుజా ఖోటాల్ అనే వ్యక్తి తన కుమార్తెను అతిక్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.

హనీమూన్ వెన్యూ విషయంలో మామా అల్లుళ్ళ వాగ్వాదం
వివాహం అనంతరం హనీమూన్ కి వెళ్లే విషయంలో హనీమూన్ వెన్యూ కోసం మామ అల్లుళ్ళ మధ్య చర్చ జరిగింది. హనీమూన్ కి కాశ్మీర్ కి వెళ్లాలని తాను అనుకుంటున్నట్లుగా అల్లుడు అతీక్ చెప్పాడు. అయితే మామ అబ్బే కాశ్మీర్ వద్దు.. విదేశాలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళండి అంటూ అల్లుడి మాటకు అడ్డుపడ్డాడు. ఈ విషయంలో మామ అల్లుళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది.
అల్లుడిపై ఊహించని విధంగా మామ యాసిడ్ దాడి
ఆ తర్వాత పని మీద బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన అతీక్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఇంట్లోకి వెళ్ళబోయాడు. ఆవరణలోని కారులో వేచి ఉన్న మామ ఊహించని విధంగా అల్లుడు పైన దాడి చేశాడు. అల్లుడి ముఖం పైన, శరీరం పైన యాసిడ్ పోసి దారుణ చర్యకు పాల్పడ్డాడు. ఆపై అక్కడినుండి మామ ముర్తుజా పరారయ్యాడు.
పరారీలో మామ, ఆస్పత్రిలో కొత్త అల్లుడు
దీంతో పోలీసులు పరారీలో ఉన్న ముర్తుజా కోసం గాలింపు చేపట్టారు. ఇక గాయపడిన అల్లుడు ఇబాద్ అతీక్ ఫాల్కేను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త అల్లుడు పైన యాసిడ్ దాడికి పాల్పడిన మామ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications