చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందుబాబులు ఉలిక్కిపడే సంఘటన.. ఆ బాటిల్లో ఉన్నది చూసి షాక్.. తీవ్ర కలకలం..

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన సడలింపులతో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయి. దీంతో దాదాపు 45 రోజుల పాటు చుక్క లేక విలవిల్లాడిన మందుబాబులు ఇక పండగ చేసుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కరోజులోనే రూ.150కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో మొదటిరోజే రూ.90కోట్లు,ఆంధ్రప్రదేశ్‌లో రూ.40కోట్లు పైచిలుకు విక్రయాలు జరిగాయి. వైన్ షాపులు తెరిచి ఐదు రోజులు కావస్తున్నా... మద్యం దుకాణాల వద్ద అదే రద్దీ కనిపిస్తోంది. అయితే తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఓ ఘటన మందుబాబులను షాక్ తినేలా చేసింది.

మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!

మద్యం సీసాలో కప్ప..

మద్యం సీసాలో కప్ప..

మైలాదుత్తురై జిల్లాలోని శీర్గాళిలో ఉన్న ఐసాని వీధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ వైన్ షాపు ఉంది. ఆదివారం ఓ వ్యక్తి ఆ షాపుకు వెళ్లి క్వార్టర్ రమ్ బాటిల్ కొనుగోలు చేశాడు. అనంతరం పొలం గట్టుకు వద్దకు వెళ్లి.. అక్కడే కూర్చొని దాన్ని ఓపెన్ చేశాడు. గ్లాసులో ఒక పెగ్ పోసుకుని... తిరిగి బాటిల్ మూత పెట్టే క్రమంలో అందులో ఉన్నది చూసి షాక్ తిన్నాడు. ఆశ్చర్యంగా అందులో అతనికి ఓ చనిపోయిన కప్ప కనిపించింది. మద్యం సీసాలో కప్ప ఎలా వచ్చిందో అతనికి అంతుచిక్కలేదు. ఈలోగా అతని మిత్రులకు విషయం చెప్పడంతో.. అది టాస్మాక్ యాజమాన్యం దాకా వెళ్లింది.

బయటకు పొక్కనివ్వని టాస్మాక్ యాజమాన్యం

బయటకు పొక్కనివ్వని టాస్మాక్ యాజమాన్యం

విషయం బయటకు పొక్కకుండా సదరు వ్యక్తి నుంచి ఆ బాటిల్‌ను టాస్మాక్ యాజమాన్యం తిరిగి తెప్పించుకుంది. దానికి బదులు మరో క్వార్టర్ బాటిల్‌ను కూడా అతనికి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈలోపే కొంతమంది ఆ బాటిల్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే టాస్మాక్ మేనేజర్ అంబికాపతి మాత్రం ఈ విషయం ఇంతవరకూ తమ దృష్టికి రాలేదన్నారు. ప్రతీ మద్యం బాటిల్‌ను పూర్తిగా పరీక్షించిన తర్వాతే షాపులకు పంపిస్తామని చెప్పారు.

Recommended Video

Rajinikanth Warns AIADMK On Reopening Liquor Shops | Oneindia Telugu
లిక్కర్ షాపులపై హైకోర్టు తాత్కాలిక నిషేధం..

లిక్కర్ షాపులపై హైకోర్టు తాత్కాలిక నిషేధం..

మరోవైపు తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మద్యం దుకాణాల వద్ద రద్దీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భౌతిక దూరం పాటించకుండా జరుపుతున్న కొనుగోళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం నిత్యావసర వస్తువేమీ కానుందునా.. విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. అవసరమైతే ఆన్‌లైన్ అమ్మకాలు చేపట్టాలని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం అమ్మకాలకు అనుమతించాలని కోరింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

English summary
In a shocking incident to a tippler a dead frog get into a ''quarter'' bottle sold at a TASMAC shop at suburban Avadi.This time, however, a buyer failed to notice the dead frog and had one round of the drink. When he poured the liquor into his glass for the second round, something got stuck at the neck of the bottle. To his horror he found the dead frog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X