విద్యార్ధినిలకు సెక్స్ పాఠాలు: నిర్మలాదేవి డైరీ సీజ్, షాకింగ్ విషయాలు

చెన్నై: విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దింపుతున్నారనే ఆరోపణలతో అరెస్టైన అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవికి చెందిన డైరీని సిబిసిఐడి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సిబిసిఐడి పోలీసులు ఆదివారం నాడు సుదీర్ఘంగా విచారణ చేశారు. ఆమెను ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఈ విషయమై విచారణ చేశారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగు చూసినట్టు సమాచారం.

తమిళనాడు రాష్ట్రంలోని అరుప్పుకోట దేవాంకూర్‌ ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సంతానం నేతృత్వంలో విచారణ కమిటిని ఏర్పాటు చేశారు.

మరోవైపు సిబిసిఐడి పోలీసులు కూడ ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. జ్యూడీషీయల్ రిమాండ్‌లో ఉన్న నిర్మలాదేవిని సిబిసిఐడి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

నిర్మలాదేవి డైరీ సీజ్

నిర్మలాదేవి డైరీ సీజ్

అరుప్పుకోట దేవాంకూర్‌ ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ నిర్మలాదేవికి చెందిన డైరీని సిబిసిఐడి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇంటి ముందు పార్కింగ్‌ చేసి ఉన్న నిర్మలాదేవి కారులో పోలీసు అధికారులు తనిఖీలు జరుపగా ఆమె రహస్య డైరీ లభించింది. ఆ డైరీలో నిర్మలాదేవితో సంబంధాలు పెట్టుకున్న పలువురి ప్రముఖుల వివరాలు ఉన్నట్టు కనుగొన్నారు. వీటన్నింటినీ పోలీసులు వీడియో తీసి భద్రపరిచారు.

ఆరు గంటల తనిఖీలు

ఆరు గంటల తనిఖీలు

అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవి ఇంట్లో సిబిసిఐడి పోలీసులు సుమారు ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. లకమైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఉన్న కంప్యూ టర్‌లో పొందుపరచిన సమాచారాలను పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారు. అదే సమయంలో నిర్మలా దేవి వాడిన పెన్‌డ్రైవ్‌లను కూడా పోలీసులు స్వాధీనపరచుకున్నారు.

నిర్మలాదేవి ప్రమోషన్‌పై విచారణ

నిర్మలాదేవి ప్రమోషన్‌పై విచారణ

అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా నిర్మలాదేవి ఎలా నియమితులయ్యారనే విషయమై కూడ సిబిసిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. నిర్మలా దేవి ఇంట్లో సోదాలు జరిపే సమయంలోనే వాంకూర్‌ కళాశాల మాజీ కార్యదర్శి చవుడయ్యను సిబిసిఐడి పోలీసులు విచారణ చేశారు. నిర్మలాదేవి ప్రమోషన్ విషయంలో రూల్స్ ప్రకారంగానే జరిగాయా ఎవరైనా సిఫారసులు చేశారా అనే కోణంలో కూడ విచారణ జరిపారు.

 విద్యార్ధినుల కుటుంబసభ్యుల విచారణ

విద్యార్ధినుల కుటుంబసభ్యుల విచారణ

అసిస్టెంట్ ప్రోఫెసర్‌తో ఫోన్‌లో మాట్లాడిన నలుగురు విద్యార్ధినుల కుటుంబ సభ్యులతో కూడ సిబిసిఐడి పోలీసులు రహాస్యంగా విచారణ చేశారు.అంతేకాదు విద్యార్ధినులను కూడ పోలీసులు రహాస్యంగా విచారణ చేసిన సమయంలో పలు అంశాలు తెలిసినట్టుగా సమాచారం.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేది లోపుగా సంతానం కమిటి విచారణ పూర్తి చేసి గవర్నర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి దశ విచారణను సంతానం కమిటి పూర్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+