షాక్: ఎముకలతో బిస్కెట్లు... దాడులు చేసి పట్టుకున్నారు
మొరాదబాద్: బిస్కెట్లు తినే వారికి ఇదొక చేదు నిజం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదబాద్‌లోని ఒక ఫ్యాక్టరీలో ఎముకలను ఉపయోగించి బిస్కట్‌లను తయారు చేస్తున్నారు.
మొరాదబాద్ మేజిస్ట్రేట్ ఏకే. శ్రీవాత్సవ మాట్లాడుతూ మాకు అందిన సమాచారంతో ఆహార సరఫరా విభాగం నేతృత్వంలో ఫ్యాక్టరీపై దాడులు చేయగా ఎముకల కుప్పలు కనిపించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

అంతే కాకుండా 14 సంవత్సరాల లోపు ఉన్న బాల కార్మికులతో పని చేయిస్తున్నారని ఆయన తెలిపారు. ఆహార నాణ్యతను పాటించకుండా బిస్కెట్లు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. బిస్కెట్ ఫ్యాక్టరీలో ఎముకలు ఎందుకున్నాయనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications