బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి !

బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా.. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 3,4 మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జిపై ఒక వ్యక్తి.. ఒక యువతిపై, ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పులు శబ్దం విన్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు ముగ్గురు మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనలో మరణించిన యువతి ఢిల్లీ వెళ్లేందుకు రైలు ఎక్కడానికి తన తండ్రితో కలిసి స్టేషన్‌కు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో గన్‌‌తో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

shocking-incident-too-place-at-ara-railway-station-in-bihar-three-dead

అడిషనల్ ఎస్పీ పరిచయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ స్టేషన్‌లోని 3, 4 ప్లాట్ ‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్‌ బ్రిడ్జిపై.. ముగ్గురు వ్యక్తులు తుపాకీ గాయాలతో మరణించారని తెలిపారు. ప్రత్యక్ష సాక్ చెప్పిన వివరాల మేరకు.. మొదట యువతిని, ఆ తర్వాత ఆమె తండ్రిని కాల్చి తర్వాత తనను తాను కాల్చుకున్నట్టు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి వయస్సు 23-24 సంవత్సరాల మధ్య ఉంటుందని.. అమ్మాయి వయస్సు 16-17 సంవత్సరాల మధ్య ఉంటుందని వివరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు ఆర్‌పీఎఫ్ సీనియర్ కమాండెంట్ ప్రకాష్ పాండా మాత్రం ఈ సంఘటన ప్లాట్‌ఫామ్ నెంబర్ 2లో జరిగిందని తెలిపారు. నిందితుడు టార్గెట్ చేసి మరీ కాల్పులు జరపడం.. ఆ తర్వాత తనకు తాను కాల్చుకోవడం చూస్తుంటే ప్రేమ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి అమన్ కుమార్ గా తెలిపారు. యువతి పేరు జియా కుమారి, ఆమె తండ్రి పేరు అనిల్ సిన్హాగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+