Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ ...ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి మిగ్ -23 యుద్ధ విమానం ... ఈ పని చేసింది ఎవరంటే !!

ఓఎల్ఎక్స్... ఏవైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు సాగించే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. ఇక అటువంటి మార్కెటింగ్ ప్లాట్ ఫాం లో ఏకంగా భారతదేశ యుద్ధ విమానాన్ని అమ్మకానికి పెట్టటం హాట్ టాపిక్ అయింది. అలీగఢ్ ముస్లింవర్సిటీలో ప్రదర్శనకు ఉన్న మిగ్- 23 యుద్ధ విమానాన్ని అమ్ముతామని ఓఎల్ఎక్స్ లో పెట్టేశారు. ఇక అంతే కాదు దాని ధర 9.99 కోట్ల రూపాయలని అందులో పేర్కొన్నారు.

సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయవిక్రయాల ప్లాట్ ఫాం ఓఎల్ఎక్స్ లో భారత యుద్ధ విమానం

సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయవిక్రయాల ప్లాట్ ఫాం ఓఎల్ఎక్స్ లో భారత యుద్ధ విమానం

ఓఎల్ఎక్స్ లో మనం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, బైకులు వంటి సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మకాలు, కొనుగోళ్ళు సాగిస్తుంటాం.. కానీ అందరినీ షాక్ కి గురి చేస్తూ అలీగఢ్ యూనివర్సిటీ లో ఉన్న యుద్ధ విమానం మిగ్- 23ని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ప్లాట్ ఫామ్ లో పెట్టాడు ఎవరో గుర్తుతెలియని ఆకతాయి . ఈ విషయం తెలిసిన వర్సిటీ సిబ్బంది వెంటనే రెస్పాండ్ అయ్యారు.

స్పందించిన అలీగఢ్ వర్సిటీ అధికారులు .. ఓఎల్ ఎక్స్ నుండి మిగ్-23 తొలగింపు

స్పందించిన అలీగఢ్ వర్సిటీ అధికారులు .. ఓఎల్ ఎక్స్ నుండి మిగ్-23 తొలగింపు

అలీగఢ్ యూనివర్సిటీ అధికారులు ఓఎల్ఎక్స్ నుంచి ఆ ఫోటోలు తీసివేయించామని పేర్కొన్నవారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కావాలని విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది యూనివర్సిటీకి చెందిన వారు చేసిన పని కాదని, బయట వ్యక్తులు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి పని చేశారని చెప్తున్న యూనివర్సిటీ అధికారులు ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఆకతాయి ఎవరో కనిపెట్టి, పనిపట్టే పనిలో ఉన్నారు అలీగఢ్ యూనివర్సిటీ అధికారులు.

Recommended Video

    AP Govt Extends Build AP E-auction For 15 Days
    అలీగఢ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బహుమతిగా మిగ్ -23

    అలీగఢ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బహుమతిగా మిగ్ -23

    కార్గిల్ యుద్ధంలో కీలకంగా భూమికను పోషించిన మిగ్- 23 యుద్ధ విమానాన్ని అలీగఢ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బహుమతిగా అందించింది. ఇక అప్పటినుండి మిగ్ 23 విమానం అలీగఢ్ యూనివర్సిటీ లో ప్రదర్శనకు ఉంది. క్యాంపస్ లో ఉన్న విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనిని యూనివర్సిటీకి బహూకరించడం జరిగింది. అయితే భారత దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యుద్ధ విమానాన్ని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+