కాలేజి క్యాంపస్ లోనే గ్యాంగ్ రేప్, ఫోన్ లో చిత్రీకరణ, బయటికి చెబితే సోషల్ మీడియాలో...
ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా బొడగాం పంచాయతీ సమితి కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ దళిత విద్యార్థిని తన సీనియర్ల చేతిలోనే సామూహిక అత్యాచారానికి గురైంది.
భువనేశ్వర్: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా బొడగాం పంచాయతీ సమితి కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ దళిత విద్యార్థిని తన సీనియర్ల చేతిలోనే సామూహిక అత్యాచారానికి గురైంది.
ఆ విద్యార్థిని సోమవారం ఒంటరిగా కళాశాలలో ఉన్న సమయంలో.. అదే కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మరో స్నేహితుడితో కలసి ఆమెను బలవంతంగా కాలేజీ ఆవరణలోనే నిర్మాణంలో ఉన్న భవనంలోని రెండో అంతస్తుకు తీసుకెళ్లారు.

అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేయడంతోపాటు మొబైల్ ఫోన్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. విషయం ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.
దీంతో బాధితురాలు ఇంటికి వచ్చిన తరువాత భయంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టింది. కానీ జరిగిన దారుణాన్ని తనలోనే దాచుకోలేకపోయింది. చివరికి ఆమె అంటీ ద్వారా తల్లిదండ్రులకు జరిగిన ఘోరం తెలిసిపోయింది.
అనంతరం దీనిపై తన తల్లితో కలసి వెళ్లి బొడగాం పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు మంగళవారం బాధితురాలు, బాధితురాలి తల్లిని విచారించడంతోపాటు కళాశాల అధ్యక్షుడు, ఇతర అధ్యాపకులతో మాట్లాడి ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించారు.
బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications