ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో చేసిన దాడిలో వందలాదిమంది తీవ్రవాదులు హతమయ్యారని భావిస్తున్నారు. ఉగ్రవాద క్యాంపుపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో మృతులు చాలామంది ఉంటారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా దాడికి ముందు ఆ ప్రాంతంలో 250 నుంచి 300 మొబైల్స్ వరకు పని చేశాయి.
ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అవి పని చేయలేదు. దీంతో దాదాపు అంతమంది తీవ్రవాదులు చనిపోయినట్లుగా భావిస్తున్నారు. కానీ విపక్షాలు పదేపదే ఎయిర్ ఫోర్స్‌ను అవమానించేలా ఈ దాడులపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. విపక్షాలపై కేంద్రమంత్రి వికే సింగ్ తాజాగా మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు.

ఇంట్లోని దోమల్ని చంపేందుకు హిట్ వాడుతాను
నేను ఇంట్లోని దోమలను చంపేసేందుకు హిట్ (HIT)ను వాడుతానని, ఆ తర్వాత నేను ఎన్ని చంపానో లెక్కించుకుంటు కూర్చుంటానా లేక ఆ తర్వాత హాయిగా నిద్రపోతానా అని ట్విట్టర్‌లో విపక్షాలను ఎద్దేవా చేశారు. దాదాపు 250 మంది తీవ్రవాదులు చనిపోయినట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఎంతమంది చనిపోయారో చెప్పాలని నిలదీస్తున్నాయి. దీంతో వీకే సింగ్ ఇలా కౌంటర్ ఇచ్చారు.

దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ఆగ్రహం
మరోవైపు, పుల్వామా ఉగ్రవాద దాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడి కాదని, ప్రమాదమని డిగ్గీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎయిర్ స్ట్రైక్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై వీకే సింగ్ వేరుగా మండిపడ్డారు.
రాజీవ్ గాంధీది హత్యనా, ప్రమాదమా, ఉగ్రవాద ఘటనా?
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీది హత్యా లేక ప్రమాదమా లేక ఉగ్రవాద ఘటనా అని కూడా వీకే సింగ్ నిప్పులు చెరిగారు. బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ దాడిలో ఎంతమంది చనిపోయి ఉంటారని విలేకరులు ప్రశ్నించారు. దానికి వీకే సింగ్ స్పందిస్తూ... బాలాకోట్ దాడిలో రెండు వందల యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారని, పాకిస్థాన్‌లోని సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేసినట్లు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications