ఆ సాక్ష్యాలను ముందు చూపండి ... దిశా రవి కేసులో పోలీసులకు ధర్మాసనం కీలక ప్రశ్నలు
దిశారవి బెయిల్ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆందోళన దిశగా దిశా రవి పురికొల్పారు అని, ఖలిస్తాన్ వేర్పాటువాదులతో కలిసి టూల్ కిట్ ను తయారు చేయడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారని సామాజిక కార్యకర్త దిశ రవి పై ఉన్న ఆరోపణలపై కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశా రవిపై వెల్లువెత్తిన ఆరోపణలపై తమకు సాక్ష్యాలను చూపాలని కోర్టు ధర్మాసనం కోరింది.
Recommended Video

అభిప్రాయ భేదం కలిగి ఉండటం దేశద్రోహానికి సమానం కాదన్న దిశా రవి తరపు న్యాయవాది
అంతకుముందు దిశా రవికి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించిన ప్రాసిక్యూషన్, టూల్ కిట్ తయారీలో దిశా రవి పాత్ర ఉందని, ఆమె అమాయకురాలు ఏమాత్రం కాదని ,కావాలనే ఇలా చేశారని పేర్కొన్నారు. బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ తో, దిశా రవి తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ తన వాదన వినిపించారు . అభిప్రాయ భేదం కలిగి ఉండటం దేశద్రోహానికి సమానం కాదని కోర్టుకు చెప్పారు.

దిశా రవి తరపు వాదనలు బలంగా వినిపించిన న్యాయవాది
తన క్లయింట్ దిశా రవి థన్ బర్గ్ ని కోరింది రైతులు లేవనెత్తిన సమస్యలకు మద్దతు కోసం అని పేర్కొన్నారు . ఆమె ఖలీస్తాన్ కోసం ట్వీట్ చేయలేదు అని గట్టిగా కోర్టు ముందు వాదించారు. పోలీసుల స్టాండ్‌ను ప్రశ్నిస్తూ, దిశా రవి తరపు న్యాయవాది అగర్వాల్ "కుంగ్ ఫూ టు యోగా" ను ఇష్టపడుతున్నారా అని అడిగారు, దీని అర్థం చైనీస్ గూఢచారిననా అని ప్రశ్నించారు . ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ధర్మేందర్ రానా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదికి , పోలీసులకు పలు ప్రశ్నలను సంధించారు.

సాక్ష్యాలను చూపాలని న్యాయమూర్తి పోలీసులకు సంధించిన ప్రశ్నలు
అసలు టూల్ కిట్ అంటే ఏంటి? అసలు దిశా రవికి, జనవరి 26 నాటి హింసాత్మక సంఘటనలకు సంబంధం ఉందని సరైన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమున్నాయి? ఉంటే వాటిని చూపించండి అంటూ న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ పోలీసులను తాము అనుమానాలను, ఊహలను ఆధారాలుగా భావించవలసిన అవసరం ఉందా అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఖలీస్తానీ సానుభూతిపరుల చర్యలతో దిశా రవిని అభివర్ణించవచ్చా అని ప్రశ్నించారు .

కేసు విచారణ వాయిదా
రిపబ్లిక్ దినోత్సవం రోజున హింసకు పాల్పడిన వారితో దిశా రవిని అనుసంధానించే ఆధారాలు ఉన్నాయా, మరియు హింసకు టూల్ కిట్ యొక్క సంబంధం ఎలాగో చెప్పండి అంటూ పోలీసులను కోరారు అంతేకాదు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేశారు.
ఇప్పటికే దిశా రవి బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 23 కు నిర్ణయం రిజర్వ్ చేసిన కోర్టు ఈ కేసులో కీలక ఆధారాలను సమర్పించాలని ప్రశ్నించింది .
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications