పాపం అంబాని, ఆదానీలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్

భారతదేశంలోని శ్రీమంతులకు ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ రెడ్ కార్పెట్ వేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. అంబానీ, అదానీలతోపాటు అత్యంత సంపన్నులకు సంబంధించి రూ 16 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని, కానీ రైతుల రుణాలు మాత్రమే మాఫీ చేయలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన ఆరోపణలు చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోని రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. హాసన్‌ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. రైతుల రుణమాఫీ హామీ పత్రాలపై ఇప్పటికే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సంతకాలు చేశారని సీఎం సిద్దరామయ్య అన్నారు.

Siddaramaiah accuses PM Modi of waiving loans of Ambani and Adani

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలోని రైతులు అందరికి కలిపి రూ. 76 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని సిద్ధరామయ్య గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతులకు చెందిన రూ 76 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ మాత్రం అంబానీ, అదానీలకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని సీఎ: సిద్దరామయ్య ఆరోపించారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ చేస్తే పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉందని సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఉచిత హామీలను ఇప్పటికే అమలు చేస్తుందని, ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేం ప్రకటించిన 25 ఉచిత హామీలను అమలు చేసి మీ కుటుంబాల అకౌంట్ లో రూ. ఒక లక్షల రూపాయలు జమ చేస్తామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

హాసన్ లో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ కుటుంబ రాజకీయాలకు కాస్త విశ్రాంతినిచ్చి ఈసారి హసన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సీఎం సిద్దరామయ్య ఆజిల్లా ప్రజలకు మనవి చేశారు. గతంలో మోదీ హామీలపై మాటల తూటాలు పేల్చిన మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పుడు ఆయన తీరు మార్చుకున్నారని, తనకు మోదీకి విడదీయరాని అనుబంధం ఉందని దేవేగౌడ చోబుతున్నారని, మీ సంబంధం చాలా బాగుంటే కొబ్బరి పంటకు మద్దతు ధర ఎందుకు ఇవ్వకూడదు అని సీఎం సిద్దరామయ్య మాజీ ప్రధాని దేవేగౌడను ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మీద మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+