MH Election 2024:మహా వికాస్ అఘాడీ కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరు:ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి దే అంతిమ విజయం అని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి మరియు ఏ.ఐ.సి.సి ఎన్నికల పరిశీలకులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల ఫలితాల భారతదేశం రాజకీయాలను మలుపు తిప్పనున్నాయని ఆయన పేర్కొన్నారు.మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరట్వాడ ప్రాంతానికి ఏ.ఐ.సి.సి సీనియర్ పరిశీలకుడిగా నియమితులైన రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తో కలసి ముఖ్ హెడ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో మహావికాస్ అగాఢీ కూటమి 200 పై చిలుకు స్థానాలలో గెలుపు సాధించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని 48 స్థానాలకు గాను 31 స్థానాల్లో ఎంవీఏ కూటమి సాధించిన విజయమే ఇందుకు తార్కాణమని ఆయన గుర్తు చేశారు.కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని అమలు పరుస్తున్నామన్నారు.

తెలంగాణలో హామీలపై..
తెలంగాణాలో 1.05 కోట్ల మహిళలు ఉచిత బస్ ప్రయాణం,500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు,50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ వంటి హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు.ఈ కార్యక్రమాలు మహారాష్ట్రలో ఎంవీఏ పాలనకు నమూనా బ్లు ప్రింట్ గా నిలుస్తాయాన్నారు.మహారాష్ట్ర-తెలంగాణా రాష్ట్రాల నడుమ లెండి సచ ప్రాజెక్టు ను నిర్మించ నున్నట్లు ఆయన వెల్లడించారు.ఉభయ రాష్ట్రాల రైతాంగానికి ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలింపు..
బీజేపీ విభజన రాజకీయాలను ఆయన తూర్పారాబట్టారు.మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి చేసిన తప్పిదాలపై ఆయన మండిపడ్డారు.మహారాష్ట్ర లోని ప్రధాన పారిశ్రామిక ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించి మహారాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించిన బీజేపీ కూటమని ఇక్కడి ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన చెప్పారు.అధికారంలోకి వస్తే అమలు పరచనున్న ఐదు గ్యారెంటీలను ఆయన వివరించారు.

మహనీయుల వారసత్వాన్ని కాపాడేది..
రైతాంగానికి 3 లక్షల రుణమాఫీ,సమయానికి రుణాలు చెల్లించిన వారికి రూ.50,000 బోనస్,మహిళలకు నెలకు రూ. 3000 మహాలక్ష్మి పథకం,ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యాభిమా,ఉచిత మందుల సరఫరా లతో పాటు కులగణన చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ రాష్ట్రంలో ఉద్బవించిన మహానేతలు ఛత్రపతి శివాజి మహారాజ్,జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలే ,డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ల వారసత్వాన్ని కాపాడగలిగేది మహా వికాస్ అగాఢీ కూటమి మాత్రమేనని,అందుకు అనుగుణంగా ఇక్కడి ప్రజలు ఎంవీఏ కూటమిని ఆదరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications