సిద్దూ క్రూరుడు, అతనికి డబ్బే ముఖ్యం.. పేరంట్స్‌ను వదిలి, సోదరి సుమన్ సెన్సేషనల్ కామెంట్స్
5 రాష్ట్రాల ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ప్రత్యర్థులు ఆరోపణలతో మునిగితేలారు. పంజాబ్‌లో అయితే పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఆయనకు ఎదురులేదు అని అంతా అనుకుంటున్న వేళ.. సోదరి సంచలన ఆరోపణలు చేశారు. సిద్దూకు డబ్బులే ముఖ్యం అని.. పేరంట్స్ బాగోగులు కూడా పట్టవు అని విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేగింది.

అమెరికాలో నివాసం..
సిద్ధూ సోదరి సుమన్ టూర్ అమెరికాలో ఉంటున్నారు. అక్కడినుంచి మీడియాలో మాట్లాడారు. సిద్ధూ, డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టిరని అన్నారు. చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం.. తల్లి నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉంది. సిద్ధూ అసలు పట్టించుకోలేదని కామెంట్ చేశారు. ఇవీ అసత్య ఆరోపణలు కావని.. వీటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని గద్గద స్వరంతో రోదించింది. ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తి సిద్ధూ అని ఆమె సోదరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

దిక్కులేని స్థితిలో..
1986లో తండ్రి చనిపోయిన తర్వాత.. తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశారని ఆమె వాపోయింది. ఆ తర్వాత తల్లి 1989లో ఒక అనాథ మహిళగా ఢిల్లీ రైల్వేస్టేషన్లో చనిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 1987లో ఇండియాటుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సిద్ధూ.. తల్లిదండ్రుల గురించి అసత్యాలే చెప్పాడని అతని సోదరి సుమన్ ఆరోపించింది. గత జనవరి 20న సిద్దూని కలవడానికి పంజాబ్ వెళ్లానని కనీసం తలుపులు తీయలేదని సుమన్ టూర్ ఆరోపించారు. తనను చాలా సేపు ఇంటి బయటే నిలబెట్టి అవమాన పరిచారని పేర్కొన్నారు.

ఫోన్ చేసి వేధింపులు
తన వయస్సు 70 ఏళ్ల అని.. సోదరుడు ఫోన్లో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడని వాపోయింది. చనిపోయిన తన తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని సుమన్ టూర్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. సిద్ధూ సోదరి చేసిన ఆరోపణలు పంజాబ్ కాంగ్రెస్‌లో హీట్‌ను పెంచాయి. విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్టు అయ్యింది. మరీ దీనిపై సిద్దూ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలీ మరీ.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications