కాంట్రాక్టులు చేసుకుంటున్నా సామాగ్రి రావట్లేదు..! బాంబుపేల్చిన ఎయిర్ ఫోర్స్ ఛీఫ్..!

భారత రక్షణరంగంలో పెను సంచలనం. దేశ రక్షణ కోసం తయారు చేస్తున్న వ్యవస్ధలకు విదేశాల నుంచి రావాల్సిన సామాగ్రి సకాలంలో రావడం లేదని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాంట్రాక్టులపై సంతకాలు చేస్తున్నప్పుడే అవి రావని తమకు అర్దమైపోతోందంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్న కార్యక్రమంలోనే ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో భారత రక్షణ రంగంలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.

రక్షణ శాఖ చేపడుతున్న ప్రధాన రక్షణ కొనుగోళ్ల ప్రాజెక్టులలో జరుగుతు్న జాప్యంపై ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. చాలాసార్లు ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎప్పటికీ రావని తమకు తెలుసన్నారు. గడువులు పెద్ద సమస్య అని, తాను ఆలోచించగలిగే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సమయానికి పూర్తి కాలేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దానిని మనం ఎందుకు వాగ్దానం చేయాలని ఆయన ప్రశ్నించారు.

signing contracts but systems never come air force chief s shocking allegation

తాను చేసిన ఆరోపణలకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ పలు ఉదాహరణలు కూడా చూపారు. ఇందులో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ గురించి వెల్లడించారు. 2021 ఫిబ్రవరిలో రూ.48వేల కోట్లకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం తేజస్ ఎంకే 1ఏ ఫైటర్ జెట్ డెలివరీలు నిలిచిపోయాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆర్డర్ చేసిన 83 విమానాలలో ఏదీ డెలివరీ కాలేదన్నారు. వాస్తవానికి తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్ల తొలి డెలివరీ గతేడాది మార్చిలోనే ప్రారంభం కావాల్సి ఉంది.

ఇలా జరుగుతున్న ఆలస్యం వల్ల అనేక కీలక ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆరోపించారు. ఇందులో తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానం ఉందని, మూడేళ్ల క్రితం ఈ ఒప్పందంపై సంతకం చేసినా ఇప్పటికీ డెలివరీ కాలేదన్నారు. అలాగే తేజస్ ఎంకే2 నమూనా కూడా ఇంకా విడుదల కాలేదన్నారు. ఎంఎంసీఏఏ యుద్ధ విమానం నమూనా కూడా అందుబాటులో లేదన్నారు. కేంద్రం ఆత్మనిర్భర్ పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తున్న న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+