వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌కు మకాం మార్చనున్న అదార్ పూనావాలా: రూ.2 కోట్ల అద్దె: ఆమె భవనంలో: సీక్రెట్ గార్డెన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అదార్ పూనావాలా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌ను ఉత్పత్తి చేయడం ఆరంభించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోన్న పేరు. కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓగా పనిచేస్తోన్నఆయన త్వరలో తన మకాంను లండన్‌కు మార్చబోతున్నారు. దీనికోసం లండన్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ సువిశాలమైన భవనాన్ని లీజుకు తీసుకున్నారు.

కల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగాకల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగా

లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం మేఫెయిర్‌. మల్టీ మిలియనీర్లు నివాసం ఉండే ప్రదేశం ఇది. మేఫెయిర్ ప్రాంతంలోని ఓ విలాసవంతమైన భవంతిని ఆదార్ పూనావాలా లీజుకు తీసుకున్నారు. లీజు మొత్తం నెలకు రెండు కోట్ల రూపాయలు. వారానికి 69,000 డాలర్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలెండ్‌కు చెందిన బిలియనీర్ డొమినికా కుల్క్‌జిక్‌తో లీజు అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నారు. ఈ భవనం 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది.

SII CEO Adar Poonawalla rents London mayfair for $69,000 a week

ప్రపంచంలో భారత్ తరువాత మరో దేశంలో నివసించాల్సి వస్తే.. తాను బ్రిటన్‌ను ఎంచుకుంటానంటూ 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆదార్ పూనావాలా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఆయన అక్కడికే మకాం మార్చనున్నారు.

SII CEO Adar Poonawalla rents London mayfair for $69,000 a week

లండన్‌లోని మేఫెయిర్ ప్రాంతంలో సీక్రెట్ గార్డెన్స్‌లో ఈ భవనం ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో నివాసం ఉన్న వారికి మాత్రమే ఈ సీక్రెట్ గార్డెన్స్‌లో ప్రవేశం ఉందని పేర్కొంది. బ్లూమ్ బర్గ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది.

English summary
Adar Poonawalla, chief executive officer at the Serum Institute of India Ltd., is leasing the home on one of the district’s best roads from Polish billionaire Dominika Kulczyk, the people said, asking not to be identified as the deal is confidential.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X