ఈ హత్యలు ఏం చెప్తున్నాయి: 'ఒకే రకంగా గౌరీలంకేష్-కల్బుర్గీ హత్యలు'
కన్నడ సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఏం చెబుతోంది? గౌరీ హత్యకు కల్బుర్గీని చంపడానికి మధ్య ఉన్న సారూప్యత ఏమిటి? కొన్ని శక్తులే వారిని పొట్టన పెట్టుకున్నాయా?
బెంగళూరు: కన్నడ సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఏం చెబుతోంది? గౌరీ హత్యకు కల్బుర్గీని చంపడానికి మధ్య ఉన్న సారూప్యత ఏమిటి? కొన్ని శక్తులే వారిని పొట్టన పెట్టుకున్నాయా? భావప్రకటనతో సాధించాల్సిన పనులను భౌతికదాడులతో సాధించాలని అనుకుంటున్నారా?
చదవండి: బెంగళూరులో ఘోరం: మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య
అడ్డొచ్చినవారిని, విబేధించిన వారిని తెరమరుగు చేయాలని చూస్తున్నారా? మత భావ ప్రకటన స్వేచ్ఛకు మనమే సంకెళ్లు వేసుకునే పరిస్థితి వచ్చిందా? నిన్న గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్ తర్వాత కల్బుర్గీ ఇప్పుడు.. గౌరీ లంకేశ్. నలుగురి హత్యలకు ఒకటే కారణం కనిపిస్తోంది.

ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో కన్నడ ప్రాంతానికి చెందిన కల్బుర్గీ, గౌరీ హత్యలకు ఎంతో సారుప్యత ఉందని అంటున్నారు. గౌరీ లంకేశ్‌ను ఆమె ఇంటి దగ్గరే దుండగులు కాల్చి చంపారు. కల్బుర్గీ విషయంలో కూడా అదే జరిగింది. ఆయను కూడా పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్పులు జరిపి హతమార్చారు.
భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకున్నందుకు, సమాజ దురాగతాలను తమ ప్రసంగాలద్వారా, రచనల ద్వారా ప్రశ్నించినందుకు వారు ప్రాణాలు కోల్పోయారు. గౌరీ, కల్బుర్గీ హత్యలు ఒకే రకమైనవని కర్నాటక మంత్రి స్వయంగా ఆరోపించారంటే అరాచక శక్తుల ఆగడాలు ఎంతమేరకు హెచ్చుమీరాయో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications