
ఉదయ్‌పూర్ మర్డర్: సిట్ ఏర్పాటు.. రంగంలోకి ఎన్ఐఏ, లీవ్స్ క్యాన్సిల్
ఉదయ్‌పూర్‌లో హిందువు తల నరికిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి.. 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై విచారించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏడీజీ ఎస్‌వోజీ అశోక్ రాథోడ్, ఏటీఎస్ ఐజీ ప్రఫుల్ల కుమార్, ఒక ఎస్పీ, అడిషనల్ ఎస్పీ కలిసి విచారిస్తారు.

ఉదయ్ పూర్ ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను 24 గంటలు నిలిపివేశారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకోనున్నారు. అలాగే పోలీసులు, ఇతర అధికారుల లీవ్స్ క్యాన్సిల్ చేశారు. ఉదయ్ పూర్ సహా అజ్మీర్, కోటా, బారన్, దౌసలో కూడా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ నలుగురు సభ్యులతో కూడిన ఎన్ఐఏ బృందాన్ని ఉదయ్ పూర్ పంపించింది.
నుపుర్ శర్మకు అనుకూలంగా ఓ దుకాణాదారు స్టేటస్ పెట్టుకున్నాడు. అదీ గిట్టని ముస్లింలు అతనిని దారుణంగా తల నరికి చంపేశారు. రాజస్థాన్‌లో గల ఉదయ్‌పూర్‌లో ఘటన జరిగింది. దీంతో హిందు సంస్థలు ఆందోళనకు దిగాయి. ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. అతనిని హత్య చేసే సమయంలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఇరు వర్గాల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో 144 సెక్షన్ విధించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కర్ప్యూ అమల్లోకి వచ్చింది. అలాగే ఉదయ్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.