మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ..ఆ నేతను ఎట్టా ఓడించేది..?
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో, ముఖ్యంగా బషోలీ అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గత కొనేళ్లుగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ నాయకుడైనా చౌదరి లాల్ సింగ్ ఇక్కడ వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు.చౌదరి లాల్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యే మరియు రెండుసార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. మరోసారి విజయం సాధించేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన జిల్లా అధ్యక్షుడు దర్శన్ కుమార్‌ను ఇక్కడ నుంచి రంగంలోకి దించింది. ఆ తరుఫున హోం మంత్రి అమిత్ షా , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య ఉంది, అయితే బషోలీ నియోజకవర్గంలో సింగ్‌లు ఎక్కువ నివాసం ఉంటున్నారు. వారి తర్వాత అండోత్రాకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి లాల్ సింగ్ వర్గానికి చెందిన వారు కావడం, అతని భార్య అండోత్రాకు చెందిన వారు కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. బషోలీలోని మారుమూల ప్రాంతాల్లో లాల్ సింగ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లతో నేరుగా మమేకం అవుతూ..బీజేపీ నియంతృత్వ పాలనకు ముగింపు పలకాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. "ఎల్‌జీ పరిపాలన మరియు బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారు" అని ఆయన ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అగ్ర నాయకులతో ప్రచారం నిర్వహించిన దర్శన్ కుమార్ ,బషోలీ సీటును కచ్చింతంగా బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2002 నుంచి బషోలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది.
బీజేపీ అభ్యర్థులను మార్చినప్పటికీ ఇక్కడ ఫలితం మాత్రం మారడం లేదు. దీంతో ఎలాగైనా ఈసారి బషోలీ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరాలని గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తోంది. దీంతో బషోలీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. జమ్మూ కాశ్మీర్‌కు మూడు దశల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 మరియు అక్టోబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు జరగ్గా, మూడో దశ పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది.












Click it and Unblock the Notifications