విషాదం : షార్ట్ సర్క్యూట్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మౌలానా ఆజాద్ కాలనీలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను ప్రవీణ్(40),ఫాతిమా(12),సాహిమా(10),రతియా(8),అబ్దుల్ అజీమ్(8),అబ్దుల్ అహద్(5)లుగా గుర్తించారు.ఒక్కసారిగా మంటలు చెలరేగి గది మొత్తం వ్యాపించాయని.. దాంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల ఢిల్లీలోని రాణీ ఝాన్సీ మార్గ్‌లోని అనాజ్ మండీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 43 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.గత నవంబర్ నెలలో యూపీలోని గోమతి నగర్ విభూతి ఖండ్ ఫ్లై ఓవర్ కింద ఉన్న మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఫైరింజన్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications