Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈఎంఐ కట్టకపోతే రిమోట్ గా మీ ఫోన్ లాక్..! ఆర్బీఐ కొత్త రూల్..!

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వినియోగదారుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కొత్త నిబంధన తీసుకురాబోతోంది. ముఖ్యంగా కొత్త ఫోన్లను ఈఎంఐపై తీసుకునే వారికి ఇది వర్తించబోతోంది. ఇకపై కొత్త మొబైల్ ఫోన్ ను ఈఎంఐపై తీసుకుని వాయిదా కట్టకపోతే మాత్రం సదరు ఫోన్ ను రిమోట్ గానే లాక్ చేసేందుకు వీలుగా ఆర్బీఐ కొత్త రూల్ తీసుకురాబోతోంది. దీంతో మొబైల్ ఫోన్ ఈఎంఐ కట్టకపోతే షాకులు తప్పేలా లేవు.

దేశంలో ప్రస్తుతం లక్షల సంఖ్యలో కొత్త ఫోన్లను ఈఎంఐలపై, క్రెడిట్ కార్డులపై వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని కొన్నాక చాలా మంది మధ్యలోనే ఈఎంఐలు కట్టకుండా వదిలేస్తున్నారు. దీంతో ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవడం బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న మొత్తాల వసూలుకు బ్యాంకులు, రుణ సంస్థలు విలువైన కాలాన్ని, వనరుల్ని వృథా చేయాల్సి వస్తోంది. దీనికి ఆర్బీఐ అడ్డుకట్ట వేయబోతోంది.

Skipping Mobile EMIs Your Phone Might Stop Working Soon

ఇందులో భాగంగా కొత్త మొబైల్ ఫోన్ ను ఈఎంఐపై తీసుకుని మధ్యలో వాయిదాలు కట్టకపోతే సదరు ఫోన్ కు రుణం ఇచ్చిన బ్యాంకు లేదా సంస్థలు దాన్ని పని చేయకుండా బ్లాక్ చేసేందుకు వీలుగా ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకురానుంది. ఇది అమల్లోకి వస్తే భారీగా పేరుకుపోతున్న ఫోన్ ఈఎంఐల నుంచి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు ఊరట లభించనుంది. అలాగే మొబైల్ ఫోన్లు ఈఎంఐలపై తీసుకుని వాయిదాలు కట్టకుండా వాడేసుకుంటున్న వారికి చెక్ పడనుంది.

చిన్న వినియోగదారుల రుణాలలో పెరుగుతున్న రుణ ఎగవేతల సమస్యను అరికట్టడం ఈ చర్య లక్ష్యమని తెలుస్తోంది. అయితే ఈ నిబంధన వినియోగదారుల హక్కులు హరిస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆర్బీఐ రూల్ ను రుణదాతలు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.

Skipping Mobile EMIs Your Phone Might Stop Working Soon

గతంలో కొంతమంది రుణదాతలు రుణం ఇచ్చే సమయంలో ఫోన్ లో యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి ఇచ్చేవారు. వాటిని ఉపయోగించి డిఫాల్ట్ అయిన రుణగ్రహీత ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసేవారు. కానీ 2023లో ఈ పద్ధతిని నిలిపివేయాలని ఆర్బీఐ రుణదాతలను కోరింది. ఇప్పుడు చర్చల తర్వాత త్వరలో ఆర్బీఐ తిరిగి ఈ నిబంధన అమలుకు సిద్దమవుతోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫోన్-లాకింగ్‌ను ప్రారంభించడానికి ముందు రుణగ్రహీతల నుండి ముందస్తు అనుమతి అవసరం. లాక్ చేయబడిన ఫోన్‌లలో రుణదాతలు వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయలేరని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+