వీరప్పన్ కూతురికి బీజేపీలో కీలకపదవి, లాయర్ విద్యాపై కామెంట్లు !
పేరుమోసిన అడవి దొంగ, స్మగ్లర్, నర హంతకుడు వీరప్పన్ కూతురు విద్యా న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై ఇప్పుడు బీజేపీ వెనుకబడిన వర్గాలు (బీసీ మోర్చ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వీరప్పన్ కుమార్తె విద్యాను పలువురు అభినందిస్తున్నారు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలైన వీరప్పన్ కుమార్తె విద్యా స్వయంసేవక్ సంఘ్ పరివార్ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం సహకారంతో న్యాయశాస్త్రం పూర్తి చేసి తమిళనాడులో బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
సంస్కారవంతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి ఉదాహరణగా వీరప్పన్ కుమార్తె విద్యా నిలిచారని సంఘ్ పరివార్ నేతలు ఒక ట్వీట్‌లో అభినందించారు. దొంగలు బీజేపీలో చేరితే ఎలాంటి క్రిమినల్ కేసులైనా కొట్టివేస్తారు అంటూ కొందరు విద్యాను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. సంఘ్ పరివార్ చేసిన ఓ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటివి పట్టించుకోకూడదని విద్యా సన్నిహితులు అంటున్నారు.

స్మగ్లర్ వీరప్పన్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కొరకరాని కొయ్యగా మారిన నరహంతకుడు వీరప్పన్ గతంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. అటవి సంపదను కొల్లగొట్టి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు వీరప్పన్ అపట్లో పెద్ద పీడకలలా మారాడు. స్మగ్లర్ వీరప్పన్ కదలికలపై పోలీసులకు నిఘా వేసినా అప్పట్లో అతన్ని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది.

పోలీసు శాఖ, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది.. ఎందరో సామాన్యులను హతమార్చిన వీరప్పన్ అతని అనుచరులు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. అడవికి తానే రాజు అని అప్పట్లో వీరప్పన్ ప్రకటించుకున్నాడు. వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులే కాదు ఆర్మీ సిబ్బంది కూడా పోరాడిన విషయాలు తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు పోలీసులతో పాటు ఆర్మీ సిబ్బంది వీరప్పన్ కోసం గాలిస్తున్న సమయంలో కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు.
కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయాడు. తరువాత 108 రోజుల పాటు డాక్టర్ రాజ్ కుమార్ ను బంధీగా పెట్టుకున్న వీరప్పన్ చివరికి ఆయన్ను ప్రాణాలతో విడిచిపెట్టారు. ఆ చీకటి జ్ఞాపకాలను కన్నడిగులు ఇప్పటికి మరిచిపోలేకపోతున్నారు. ఆ సందర్బంలో కర్ణాటకలోని కోట్లాది మంది రాజ్ కుమార్ అభిమానులను ఆగ్రహానికి గురి చెయ్యడంతో కర్ణాటక అట్టుడికిపోయింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ సర్కార్ పడినపాట్లు అంతాఇంతకాదు. శత్రువులకు కూడా ఇలాంటి ప్రభుత్వం వద్దురా దేవుడా అంటూ అప్పట్లో రాజకీయ నాయకులు అన్నారు.
కొంతకాలం తరువాత మాజీ మంత్రి నాగప్పను వీరప్పన్ అనుచరులు కిడ్నాప్ చెయ్యడతో అప్పటి ప్రభుత్వం తలదించుకుంది. దశాబ్దాల పాటు రెండు రాష్ట్రాల తలనొప్పులకు కేంద్ర బిందువు అయిన స్మగ్లర్ వీరప్పన్ ను తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఎస్ టీఎఫ్ అధికారులు ఎన్‌కౌంటర్ లో చంపేశారు. ఇప్పుడు స్మగ్లర్ వీరప్పన్ ను కథ చీకటి చరిత్రగా మారింది. అలాంటి వీరప్పన్ కూతురు విద్యా ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సంఘ్ పరివార్ వనవాసి కళ్యాణ ఆశ్రమం సహకారంతో న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలైంది.

అంతేకాకుండా బీజేపీ తమిళనాడు బీసీ డిన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా విద్యా నియమితులైంది. క్రిమినల్స్ పిల్లలు కూడా సంస్కారవంతులు అవుతారనడానికి స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా ఉదాహరణగా నిలిచిందని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే దొంగలను, వారి పిల్లలను కాపాడటానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications