మానసిక వికలాంగురాలితో పాడుపని .. తొలగిన సామాజిక కార్యకర్త ముసుగు

ముంబై : చెప్పేది శ్రీరంగ నీతులు .. దూరేది .. అన్న సామెత ఊరికే రాలేదు. పైకి సంఘ సేవ చేస్తున్నట్టు బిల్డప్. కానీ లోన .. అదే మనసులో మాత్రం పాడుబుద్ది. అదీ కూడా ఓ మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేయబోయి .. అడ్డంగా దొరికిపోయాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. సామాజిక కార్యకర్తలు ఇలాంటి పనులు చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బ్రిడ్జీ కింద పాడుపని ..
ముంబైలోని సంత్‌నగర్‌లోని ఓ రోడ్ బ్రిడ్జీ కింద పాడు పనిచేయబోయాడు. అయితే కీచకుడి గమనించిన ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు ప్రవీణ్ సదానంద్ (35) గుర్తించారు. అతను చేసిన గొప్ప పని అనుకున్నాడో ఏమో కానీ .. తాను సామాజిక కార్యకర్తను చెప్పాడు. అతనితో ఉన్న మహిళ 43 ఏళ్ల మానసిక వికలాంగురాలని గుర్తించారు. ఎవరూ లేని చూసి అఘాయిత్యం చేయబోయాడు. పక్కా సమాచారంతో దాడి చేయడంతో ప్రవీణ్ ముసుగు తొలిగింది.

Social worker rapes 43-year old mentally challenged woman, caught

ఎవరూ లేరని తెలిసి ...
ముంబైలోని విరార్‌లో మహిళ ఉంటుంది. అయితే మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో రోడ్డుపైనే ఉంటుంది. అటుగా వెళ్తున్న ప్రవీణ్ .. కన్ను ఆమెపై పడింది. మాయమాటలు చెప్పి .. సంత్ నగర్ బ్రిడ్జీ కిందకు తీసుకొచ్చాడు. మానసిక స్థిమితం సరిగాలేని మహిళపై అఘాయిత్యం చేయబోయాడు. అయితే అక్కడ ఎవరో ఉన్నారని గుర్తించి .. పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ ఆట కట్టించారు. ఆ మహిళకు ఎవరూ లేరనే విషయాన్ని గమనించి తనతో తీసుకొచ్చానని ప్రవీణ్ పోలీసులకు తెలిపారు. అతనిపై ఐపీసీ 363, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+