8వ అంతస్తు నుంచి కిందపడ్డ సాప్ట్ వేర్ ఇంజనీర్, మృతి...?
చెన్నై: చెన్నైలో అనుమానాస్పద స్ధితిలో సాప్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా బిల్డింగ్ పై నుంచి ఎవరైనా కిందకు తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
వేలూరు జిల్లా, రాణీపేటకు చెందిన వేలాండి ఓ రైతు. ఇతని కుమారుడు అరవింద్ (25). ఇతను చెన్నై ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోగల పెరుంగుడిలో ఉన్న ప్రైవేటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

చెన్నైలోని తిరువాన్మియూరు భారతిదాసన్ వీధిలో ఒక అద్దె ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గురువారం రాత్రి అరవింద్ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరేందుకు బయటకు వచ్చాడు. ఈలోపు సడన్ గా 8వ అంతస్తు నుంచి కిందపడ్డాడు.
వెంటనే రక్తపు మడుగులో ఉన్న అరవింద్‌ను అక్కడి వ్యక్తులు 108 అంబులెన్స్‌లో చెన్నైలోని రాయపేట ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అరవింద్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తురైపాక్కం ఇన్‌స్పెక్టర్ మహేశ్‌కుమార్ అరవింద్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications