ప్రియుడి పేరుతో బాంబు బెదిరింపులకు పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఎందుకో తెలుసా!

సహజంగా ప్రేమ విఫలమైతే ఎవరైనా బాధ పడతారు. ఆ బాధను మర్చిపోయి మళ్ళీ నార్మల్ జీవితం కొనసాగించటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల ప్రేమ వైఫల్యాలు మనుషులను క్రిమినల్స్ ను చేస్తున్నాయి. ప్రేమ నిరాకరించిన వ్యక్తిపై పగ తీర్చుకునేలా ప్రేరేపిస్తున్నాయి. అటువంటి ఘటనే బెంగళూరులో జరిగింది.

ప్రేమ వైఫల్యం.. ప్రతీకారం కోసం మహిళా సాఫ్ట్ వేర్ స్కెచ్
తన ప్రేమను నిరాకరించాడని ఒక యువకుడిపై కక్ష పెంచుకున్న యువతీ అతడిపై ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఎవరూ ఊహించని పని చేసింది. అందంగా ఉన్న, బిఈ ఎలెక్ట్రానిక్స్ చదువుకుని ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న రెని జోలిల్డా తన ప్రేమను నిరాకరించిన యువకుడిని కేసులో ఇరికించాలని భావించి తానే అడ్డంగా ఇరుక్కుంది.

Software engineer who made bomb threats in the name of his lover Do you know why

Take a Poll

ప్రియుడ్ని కేసులలో ఇరికించాలని కుట్ర
యువకుడి పేరు మీద నకిలీ ఆన్ లైన్ ఖాతాలు సృష్టించి స్కూల్స్, కాలేజీలకు బాంబు బెదిరింపులు పంపింది. గుజరాత్ కేంద్రంగా ఆమె ఈ కార్యాకలాపాలను నిర్వహించింది. గతంలో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియానికి, బెంగళూరు లోని ఆరు విద్యా సంస్థలకు బాంబులు పెట్టినట్టు హెచ్చరికలు పంపింది. తనను నిరాకరించిన వ్యక్తి పేరుతో అకౌంట్స్ ఉండటం వలన అతను సమస్యల్లో ఇరుక్కుంటాడని భావించింది.

మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్
పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ యువతిని బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు విచారణ జరుపుతున్నారు. సదరు యువతి గుజరాత్ నుండే బెంగళూరు స్కూల్స్, కాలేజీలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపినట్టు గుర్తించారు. తన ప్రేమికుడి పేరు మీద అకౌంట్స్ ఉండటంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేస్తారని భావించి ఈ విధంగా చేసింది.

మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను విచారిస్తున్న బెంగళూరు పోలీసులు
జూన్ 14న ఆమె బాంబు బెదిరింపులు పంపటంతో ఒక్కసారిగా బెంగళూరు నగరం ఉలిక్కిపడింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణలో రెని జోలిల్డా తానే ఆ సందేశాలు పంపినట్టు అంగీకరించినట్టు పోలీస్ కమీషనర్ తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించటానికి ఆమెను విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+